Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ లేకుండా అర్థరాత్రులు #OG షూటింగ్..షాక్ లో ఫ్యాన్స్
ఆయన లేకపోయినా కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండడం తో అభిమానులు అసలు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో ఎంత సేపు కనిపిస్తాడు..?, ఆయన లేకుండా ఇన్ని షెడ్యూల్స్ జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతున్నారు.

Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం #OG. గత నెల ప్రారంభ వారం వరకు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ‘వారాహి విజయ యాత్ర’ లో బిజీ అయ్యాడు. ఆయన బిజీ అయ్యినప్పటికీ కూడా #OG మూవీ షూటింగ్ ఆగలేదు. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూనే ఉన్నారు. మూడవ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు కేవలం వారం రోజులు మాత్రమే.
ఈ షెడ్యూల్ లో ఆయన పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక పవన్ కళ్యాణ్ టూర్ తో బిజీ అయ్యాడు కానీ, అదే షెడ్యూల్ మరో మూడు వారల వరకు కొనసాగింది. ఈ షెడ్యూల్ పూర్తి అయినా తర్వాత సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి అయ్యినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సైలెంట్ గా నాల్గవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించుకుంది ఈ చిత్రం.
కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించి నైట్ షూట్ ప్రారంభం అయ్యిందని, నాల్గవ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొన్నది అని, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఒక ట్వీట్ వేసింది. ఒకపక్క పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర ‘ రెండవ దశ ని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించాడు. క్షణ కాలం తీరిక లేకుండా ర్యాలీలు, సభలతో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు.
ఆయన లేకపోయినా కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండడం తో అభిమానులు అసలు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో ఎంత సేపు కనిపిస్తాడు..?, ఆయన లేకుండా ఇన్ని షెడ్యూల్స్ జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇంకా 30 నుండి 35 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. ఆగష్టు నెలలో ఆయన డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
