Lakshmi Manchu: గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేసిన మంచు లక్ష్మి… లేటు వయసులో ఘాటు ఫోజులు!
గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ తో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే బ్రేక్ రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె చిత్రాలు చేస్తున్నారు.

Lakshmi Manchu: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మంచు లక్ష్మి. ఎవరేం అనుకున్నా అసలు పట్టించుకోదు. పనిలేని వాళ్ళ మాటలు పట్టించుకుంటే జీవితంలో ఎదగలేం అంటుంది. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి విపరీతమైన ట్రోల్స్ కి గురయ్యారు. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ అనేక యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. మీమ్ పేజెస్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ముందుకు వెళుతుంది అమ్మడు. మంచు లక్ష్మి హీరోయిన్ గా ఎదగాలనుకున్నారు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేశారు.
గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ తో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే బ్రేక్ రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో ;లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి కాగా విడుదల కావాల్సి ఉంది. అగ్ని నక్షత్రం యాక్షన్ ఎంటర్టైనర్ కాగా… మోహన్ బాబు సైతం కీలక రోల్ చేస్తున్నారట.
మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం. ఇటీవల సైమా వేడుకల్లో మంచు లక్ష్మి సందడి చేశారు. వేదికపై వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సైమా వేడుకల్లో మంచు లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్, సమంతతో పాటు పలువురు స్టార్స్ మంచు లక్ష్మితో సన్నిహితంగా ఉంటారు. వారితో కలిసి వరల్డ్ టూర్స్, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళుతుంది.
ఈ ఏడాది మార్చి నెలలో తమ్ముడు మంచు మనోజ్ వివాహం చేసింది. భూమా అఖిల ప్రియ-మనోజ్ వివాహానికి మంచు లక్ష్మి పెద్ద అయ్యారు. మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహం జరిగింది. మూడు రోజులు పెళ్లి ఘనంగా జరిగింది. మోహన్ బాబు చివరి నిమిషంలో హాజరయ్యాడు. మంచు విష్ణు పెళ్ళికి దూరంగా ఉన్నాడు. మోహన్ బాబు వారసుల మధ్య విబేధాలు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు మంచు లక్ష్మి ఫిట్నెస్ ఫ్రీక్. యోగాలో ప్రావీణ్యం ఉంది. వయసు దరిచేరనీయకుండా జాగ్రత్తగా ఉంటుంది. నాలుగు పదుల వయసులో కూడా ఆమె స్లిమ్ అండ్ ఫిట్ ఫిగర్ మైంటైన్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆమె ఒకింత హద్దులు దాటేశారనిపిస్తుంది. మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
