Adipurush Trailer Record : రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ తో య్యూటూబ్ షేక్ అవుతోంది. హిందీ ట్రైలర్ కు 24 నిమిషాల్లో, తెలుగు ట్రైలర్ కు 31 నిమిషాల్లోనే ఏకంగా 10 లక్షల వ్యూస్ రావడం విశేషం. హిందీ ట్రైలర్ గంటలోనే ఏకంగా 21 లక్షల వ్యూస్ సాధించి ఔరా అనిపించింది

  • Written By: NARESH
  • Published On:
Adipurush Trailer Record : రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ట్రైలర్

Adipurush Trailer Record : ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేయగానే ఎంతో ఊహించారు. ప్రభాస్ ను నెత్తిన పెట్టుకున్నారు. బీజేపీ సైతం ఓన్ చేసుకుంది. మోడీ స్వయంగా పిలిచి ప్రభాస్ ను అభినందించాడు. ఇక అయోధ్య దేవాలయం ఓపెనింగ్ రోజే ఆదిపురుష్ సినిమాను విడుదల చేయాలని.. దీనికి ఘనమైన ఓపెనింగ్స్ రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

అయితే ఆదిపురుష్ లో ఇటు రాముడిగా ప్రభాస్ గెటప్ కానీ.. విలన్ సైఫ్ అలీఖాన్ వేషధారణపై తీవ్ర విమర్శలు వచ్చాయి.తొలి ట్రైలర్ పిల్లల కార్టూన్ సినిమాలా ఉందంటూ అందరూ దుమ్మెత్తిపోశారు. రామాయణం చెడగొట్టారని.. రాముడిగా ప్రభాస్ కు మీసాలు పెట్టారని.. ఒక రాక్షసుడిగా రావణాసురుడిని చూపించారని దుయ్యబట్టారు. దీంతో దెబ్బకు దిగివచ్చిన ప్రభాస్ వెంటనే దర్శకుడు ఓం రౌత్ తో మాట్లాడి సినిమాను సంక్రాంతి నుంచి వాయిదా వేయించాడు. అనంతరం బెటర్ అవుట్ పుట్ గ్రాఫిక్స్ చేయించి తాజాగా మరో తాజా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది ఫీల్ గుడ్ గా ఉంది. నాటి రామాయణ ఇతివృత్తానికి తగ్గట్టుగా పాత్రలు, చిత్రణ, అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంది.

అందుకే ఆదిపురుష్ ట్రైలర్ కు ఈసారి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులతో నిజంగానే ‘జై శ్రీరామ్’ అనిపిస్తోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ డైలాగ్స్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ట్రైలర్ చూస్తున్నంత సేపు డివోషనల్ మూడ్ లోకి తీసుకెళుతోంది.

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ తో య్యూటూబ్ షేక్ అవుతోంది. హిందీ ట్రైలర్ కు 24 నిమిషాల్లో, తెలుగు ట్రైలర్ కు 31 నిమిషాల్లోనే ఏకంగా 10 లక్షల వ్యూస్ రావడం విశేషం. హిందీ ట్రైలర్ గంటలోనే ఏకంగా 21 లక్షల వ్యూస్ సాధించి ఔరా అనిపించింది. మరీ మీరూ చూసి ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయం చెప్పండి..

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు