Kushi Movie Collections: ఆ రెండు ప్రదేశాలలో అప్పుడే సూపర్ హిట్ స్టేటస్ అందుకున్న ఖుషి
ముందు నుంచి ఈ సినిమాకి ఓవర్సీస్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా ఈ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఓవర్ సీస్ లో సాధించగా తరువాత నైజాం లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది.

Kushi Movie Collections: విజయ్ దేవరకొండ- సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. భార్యాభర్తల మధ్య ఉండే అపోహాల్ని, అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ ఖుషి మూవీని తెరకెక్కించారు.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 52.50 కోట్ల బిజినెస్ జరిగిందని తెలిసింది. ఈ చిత్రం ఇప్పటికే రెండు ప్లేసులో బ్రేక్ ఈవెన్ సాధించేసింది.
ముందు నుంచి ఈ సినిమాకి ఓవర్సీస్ లో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా ఈ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఓవర్ సీస్ లో సాధించగా తరువాత నైజాం లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది.
ముఖ్యంగా ఓవర్సీస్‌లో 15 కోట్ల గ్రాస్ సాధించిందని.. దీంతో అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇక మిగతా ప్లేసుల్లో ఎప్పటికీ బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంటుంది అనేది ఈ సోమవారం నుంచి ఈ సినిమాల రన్ అయ్యే దానిపైన ఉంటుంది.
ఇక ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రేంజ్ నుండి 10.5 కోట్ల రేంజ్‌లో గ్రాస్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మూడో రోజు టోటల్ వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు 17 కోట్ల రేంజ్ నుండి 18 కోట్ల రేంజ్‌లో గ్రాస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మూడు రోజు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని తెలుస్తోంది.
మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. హీషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా ఖుషి నిలిచింది. లైగర్ మూవీ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లకు అమ్ముడుపోయాయి.
