Kushi Movie OTT: ఓటీటీలో ఖుషి… ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
ఇప్పటికి వరకు వస్తున్నా సినిమా రిపోర్ట్స్ గమనిస్తే మంచి డీసెంట్ టాక్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగితే, సెకండ్ ఆఫ్ వచ్చేసి పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ మీద నడిచినట్టు తెలుస్తుంది.

Kushi Movie OTT: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఖుషి తాజాగా సెప్టెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు విజయ్. అలాగే నాగ చైతన్య తో బ్రేక్ అప్ తర్వాత సమంత నుండి లవ్ అండ్ ఫ్యామిలీ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
ఇప్పటికి వరకు వస్తున్నా సినిమా రిపోర్ట్స్ గమనిస్తే మంచి డీసెంట్ టాక్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సరదాగా సాగితే, సెకండ్ ఆఫ్ వచ్చేసి పూర్తిగా ఎమోషనల్ కంటెంట్ మీద నడిచినట్టు తెలుస్తుంది. మజిలీ లాంటి సినిమా తీసిన దర్శకుడు కావడంతో ఎమోషనల్ ట్రాక్ ను బాగానే హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం ఉంది.
అందుకు తగ్గట్లే యూఎస్ ప్రీమియర్స్ కి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. దాదాపు 500k డాలర్లు దాక వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుంది అనే దానిపై చర్చలు అప్పుడే మొదలయ్యాయి. వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం భారీ ఓటిటి సంస్థలు ఆసక్తి కనపరిచినట్లు తెలుస్తుంది. అయితే నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నిబంధనలు ప్రకారం సినిమాను ఆరు వారాల తర్వాత ఓటీటీ లో రిలీజ్ చేయాలి. కానీ మెజారిటీ నిర్మాణ సంస్థలు సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ లో రిలీజ్ అయ్యేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆ కోణంలో చూసుకుంటే ఖుషి సినిమా అక్టోబర్ 1 కి ఓటిటి లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఏదో ఒక పండగ టైం చూసుకొని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసే ఛాన్స్ లేకపోలేదు.
Recommended Video:
