Kushi Collections: యూఎస్ లో ఖుషి వసూళ్ల సునామీ… చిరును కూడా దాటేశాడే!
ఈ సినిమా ప్రీమియర్స్ ముందుగానే ఓవర్శిస్ లో మొదలైయ్యాయి. చాలా ముందుగానే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యూఎస్, కెనడా లో ముందుగానే టికెట్స్ బుక్ అయ్యాయి.

Kushi Collections: విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఒక సంచలనమే అనే చెప్పాలి. కెరీర్ మొదట్లోనే మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుని ప్రామిసింగ్ హీరోగా నిలబడ్డాడు. ఆ తర్వాత కొన్ని పరాజయాలు పలకరించిన కానీ చెక్కు చెదరకుండా సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ రౌడీ బాయ్. తాజాగా విజయ్ నటించిన ఖుషి మూవీ వరల్డ్ వైడ్ ఈ రోజే విడుదల అయ్యింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ప్రీమియర్స్ ముందుగానే ఓవర్శిస్ లో మొదలైయ్యాయి. చాలా ముందుగానే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యూఎస్, కెనడా లో ముందుగానే టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక నార్త్ అమెరికా లో కూడా ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ప్రీమియర్స్ బుకింగ్స్ జరిగాయి. ప్రధానంగా యూఎస్ లో దాదాపు 296 స్క్రీన్ లో ఈ సినిమా విడుదలైంది. ఇక్కడ 410k డాలర్లు వసూళ్లు చేసింది ఖుషి సినిమా. ఇండియా లెక్కల్లో చెప్పాలంటే 3. 38 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది ఖుషి సినిమా.
ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన కొన్ని సినిమాలు మాత్రమే నార్త్ అమెరికా లో ఓ మోస్తరు వసూళ్లు సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ 308k డాలర్లు మాత్రమే సాధించింది. తాజాగా ఖుషి ఆ రికార్డును బద్దలు కొట్టిందని చెప్పాలి. ఇప్పటికి ఫైనల్ ప్రీమియర్స్ వసూళ్లు లెక్కలు రాలేదు. అవన్నీ వస్తే ఫిగర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో వచ్చిన లైగర్ సినిమా 504k డాలర్లు వసూళ్లు చేసింది. ఖుషి ఫైనల్ ప్రీమియర్స్ వసూళ్లు లైగర్ సెట్ చేసిన మార్క్ ను దాటుతుందో లేదో చూడాలి.
నిజానికి విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో విజయ్ మార్కెట్ పడిపోయిందనే మాటలు వినిపించాయి. కానీ ఖుషి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే విజయ్ మార్కెట్ కి వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలుస్తుంది. ఎక్కడ ప్రభావం ఖుషి మీద పడలేదనే చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే యూఎస్ నుంచి డీసెంట్ టాక్ అయితే వినిపిస్తుంది. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. మార్నింగ్ షో పూర్తి అయితే కానీ సినిమా రిజల్ట్ ఏమిటో అర్థం కాదు
Recommended Video:
