Kushi Collections: మూడో రోజు దుమ్ముదులిపిన విజయ్ దేవరకొండ .. ఖుషి ఖుషీగా వసూళ్లు
మొదటి రెండు రోజులు వరల్డ్ వైడ్ గా దాదాపు 44 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో 25 కోట్లు గ్రాస్ సాధించింది. ఓవర్శిస్ అలాగే తమిళనాడు, కర్ణాటక లో కూడా మంచి వసూళ్లు కొల్లగొడుతుంది ఈ సినిమా.

Kushi Collections: లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి శాకుంతలం తర్వాత సమంత నుండి వచ్చిన సినిమా ఖుషి కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. పైగా ఖుషి సాంగ్స్ కూడా సూపర్ హిట్ కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. దానిని తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఆ తర్వాత సినిమా విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది ఖుషి.
మొదటి రెండు రోజులు వరల్డ్ వైడ్ గా దాదాపు 44 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో 25 కోట్లు గ్రాస్ సాధించింది. ఓవర్శిస్ అలాగే తమిళనాడు, కర్ణాటక లో కూడా మంచి వసూళ్లు కొల్లగొడుతుంది ఈ సినిమా. ఇక మూడో రోజు ఆదివారం కూడా కలిసి రావడంతో ఖుషి కి బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. తెలుగు రెండు రాష్ట్రాల్లో మూడో రోజు 11 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
ఇక తమిళనాడు లో ఒక కోటి , కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 1. 5 కోట్ల వసూళ్లు చేసింది. ఇక ఓవర్శిస్ తో కలిసి మూడో రోజు వరల్డ్ వైడ్ గా 17 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది ఖుషి సినిమా. రెండో రోజు తో పోల్చితే మూడో రోజు కొంచెం పర్వాలేదు అనిపించే వసూళ్లు వచ్చాయి. దీనితో మూడు రోజుల్లో 60 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది ఈ సినిమా. మూడు రోజులకి కలిపి దాదాపు 32 కోట్ల నెట్ వసూళ్లు చేసింది ఖుషి సినిమా.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 21 కోట్ల నెట్ వసూళ్లు చేయాల్సి ఉంది. ఏ సినిమాకు అయిన మండే టెస్ట్ అనేది ప్రధానం. ఖుషి సినిమా మండే రోజు ఇచ్చే పెర్ఫామెన్స్ ను బట్టి ఎంత త్వరగా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చెప్పవచ్చు. ప్రస్తుతానికి థియేటర్లలో పోటీగా మరో సినిమా ఏది లేకపోవడం ఖుషి సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో 21 కోట్ల నెట్ సాధిస్తే తప్ప సినిమాను తీసుకున్న బయ్యర్లు కు, నిర్మాతకు ఓవర్ ఫ్లో అనేది రాదు.
