Kushi Collections: ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్… దుమ్ముదులిపిన విజయ్ దేవరకొండ!
ఓవర్సీస్ లో ఖుషి దుమ్ముదులిపింది. ఏకంగా ఫస్ట్ డే రూ. 4.20 కోట్ల షేర్ వసూలు చేసింది. ఖుషి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. అవన్నీ కలిపి రూ. 45 లక్షల షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ ఖుషి రూ. 15.37 కోట్ల షేర్, 26.85 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Kushi Collections: పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఖుషి వసూళ్ళలో అదే జోరు చూపించింది. ఫస్ట్ డే వసూళ్ల వర్షం కురిపించింది. వీకెండ్ ముగిసే నాటికి ఖుషి భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఖుషి మూవీతో విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాడు. నైజాంలో ఖుషి రూ. 5.15 కోట్ల షేర్ రాబట్టింది. ఆంధ్రా/తెలంగాణాలలో రూ. 9.87 కోట్ల షేర్, రూ. 15.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 85 లక్షలు వసూళ్లు అందుకుంది.
ఓవర్సీస్ లో ఖుషి దుమ్ముదులిపింది. ఏకంగా ఫస్ట్ డే రూ. 4.20 కోట్ల షేర్ వసూలు చేసింది. ఖుషి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. అవన్నీ కలిపి రూ. 45 లక్షల షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ ఖుషి రూ. 15.37 కోట్ల షేర్, 26.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఖుషి వరల్డ్ రూ. 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. మరి ఊపు చూస్తుంటే ఫస్ట్ డే వెకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఖుషి సక్సెస్ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ పండగ చేసుకుంటున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. విజయ్ దేవరకొండకు జంటగా సమంత నటించారు. లవ్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్ వర్క్ అవుట్ కాగా సినిమా బాగుందన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ పడింది. ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్స్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి.
ప్రాంతాల వారీగా ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్….
నైజాం: 5.15 కోట్లు
సీడెడ్: 91 లక్షలు
ఉత్తరాంధ్ర: 1.13 కోట్లు
తూర్పు: 66 లక్షలు
పశ్చిమ: 63 లక్షలు
గుంటూరు: 66 లక్షలు
కృష్ణ: 44 లక్షలు
నెల్లూరు: 29 లక్షలు
ఏపీ/ తెలంగాణాల్లో రూ. 9.87 కోట్ల షేర్ (15.85 కోట్ల గ్రాస్)
కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా– 85 లక్షలు
ఇతర భాషలు: 45 లక్షలు
ఓవర్సీస్: 4.20 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 15.37 కోట్లు(26.85 కోట్ల గ్రాస్)
