Kushi Movie Babloo: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఖుషి మూవీ బబ్లూ.. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
ఇంటర్వ్యూ లో తను మాట్లాడుతూ నేను సినిమాలు చేస్తు చాలా బిజీ గా ఉన్న టైంలో 2012 లో మా నాన్నగారు చనిపోయారు. దాంతో చాలా రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.

Kushi Movie Babloo: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో ముందుకెళ్తు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో సందడి చేసినప్పటికీ ప్రస్తుతం వాళ్లకి సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక స్థాయి సంపాదించుకోవడం కోసం ఇప్పటికీ ఇండస్ట్రీ లో అవకాశాల కోసం నిరీక్షణ చేస్తూనే ఉంటారు.అలాంటి వాళ్లలో బబ్లూ ఒకడు. తేజ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.అప్పుడు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈయన చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ అసలు ఏమైపోయాడో కూడా తెలియకుండా కెమెరా ముందుకు రాకుండా ఉండిపోయాడు దాంతో బబ్లు గురించి అందరూ మర్చిపోయారు.కానీ ఇప్పుడు సడన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కనిపించాడు.ఇన్ని రోజులు తను ఎందుకు సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.
ఇంటర్వ్యూ లో తను మాట్లాడుతూ నేను సినిమాలు చేస్తు చాలా బిజీ గా ఉన్న టైంలో 2012 లో మా నాన్నగారు చనిపోయారు. దాంతో చాలా రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.ఇక 2022లో మళ్లీ మా చెల్లి అనారోగ్యంతో చనిపోయింది. రీసెంట్ గా మా మేనత్త కొడుకు కూడా చనిపోవడంతో ఒక్కసారి గా నాకు నేను ఒంటరి వాడిని అయ్యాను అనే ఫీలింగ్ లో ఉండిపోయాను.

Kushi Movie Babloo
అందుకనే నేను సినిమాలకి దూరంగా ఉన్నాను అని చెప్పాడు. అలాగే ఆ డిప్రెషన్ టైం లో బ్యాంకాక్ వెళ్లి అక్కడ డీజే గా వర్క్ చేశానాని చెప్పాడు.అలాగే ప్రస్తుతం ఒక ఫిలిం అకాడమీలో ఫ్యాకల్టీ గా పని చేస్తున్నట్టుగా చెప్పాడు. మళ్లీ తొందర్లోనే ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలిపాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో అల్లు అర్జున్ ఆర్య లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బబ్లు…
ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కూడా నటించాడు. అయినప్పటికీ ఆయనకు స్టార్ కమెడియన్ గా పేరు రాలేదు. దాంతో ఆయన మధ్యలోనే ఫెడవుట్ అయిపోవాల్సి వచ్చింది ఇండస్ట్రీలో ఎవరు ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి…
