Kriti Shetty : నాకు కాబోయే భర్తకు అది పెద్దగా ఉండాలి.. కృతి శెట్టి ఓపెన్ కామెంట్స్!

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… మొదటిగా అతడు నిజాయితీ పరుడై ఉండాలి. విషయం ఏదైనా దాపరికం లేకుండా చెప్పేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి ఉండాలట.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Kriti Shetty : నాకు కాబోయే భర్తకు అది పెద్దగా ఉండాలి.. కృతి శెట్టి ఓపెన్ కామెంట్స్!

Kriti Shetty : అమ్మాయిలకు అనేక కలలు ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి వాడు భర్తగా రావాలనే కోరికలు ఉంటాయి. వయసు వచ్చినప్పటి నుండి భర్త గురించి ఆడవాళ్లు కలలు కంటారు. కాబోయే వాడిపై కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. యంగ్ బ్యూటీ కృతి శెట్టికి కూడా తన భర్త విషయంలో క్లారిటీగా ఉన్నారు. నా భర్తకు ఇలాంటి లక్షణాలు ఉండాలని ఓపెన్ గా చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… మొదటిగా అతడు నిజాయితీ పరుడై ఉండాలి. విషయం ఏదైనా దాపరికం లేకుండా చెప్పేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి ఉండాలట.

అలాగే మరీ బక్కగా కాకుండా కొంచెం బొద్దుగా ఉంటే నాకు నచ్చుతారు. నాకు కాబోయే భర్తకు ఖచ్చితంగా మంచి బాడీ పెద్దగా ఉండాలి.ఫిజిక్ పెద్దగా బాగుండాలి.. అలాంటి భర్త రావాలని కృతి శెట్టి తెలియజేశారు. కృతి శెట్టి రిక్వైర్మెంట్ ఏమిటో క్లారిటీ వచ్చేసింది. అబ్బాయిలు తమలో కృతి శెట్టి చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండిక. అలాగే హీరోల్లో రామ్ చరణ్, శివ కార్తికేయన్ అంటే కృతికి చాలా ఇష్టమట. హీరోయిన్స్ లో అలియా భట్ అంటే అభిమానమట. అలియాను ఎంతగానో ఇష్టపడతానని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

మరోవైపు కృతి శెట్టి కెరీర్ ప్రమాదంలో పడింది. ఆమె వరుసగా నాలుగులో ప్లాప్ ఇచ్చారు. కృతి తెలుగులో నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కస్టడీ మూవీ సైతం డిజాస్టర్ కాగా ఆమెకు వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను దూరం పెట్టే అవకాశం కలదు. దానికి తోడు శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది. కృతికి ఆప్షన్ గా శ్రీలీల మారింది.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఓ తమిళ్, మరొక మలయాళ చిత్రం ఉంది. తెలుగులో ఒక్క చిత్రానికి కూడా సైన్ చేయలేదు. కృతి కెరీర్లో ఉప్పెన అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. ఉప్పెన కృతిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. అనంతరం నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సైతం హిట్ టాక్ తెచ్చుకోవడంతో లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె అన్ లక్కీ హీరోయిన్ గా మారారు. చూడాలి ఇక కృతి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో…

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు