Kriti Sanon- Prabhas: ఒకపక్క ఎఫైర్ రూమర్స్… ప్రభాస్ పై కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అప్పట్లో ప్రభాస్, కృతి ఎఫైర్ రూమర్స్ గురించి బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే ఈ వార్తలను కృతి సనన్ ఖండించారు.

  • Written By: SRK
  • Published On:
Kriti Sanon- Prabhas: ఒకపక్క ఎఫైర్ రూమర్స్… ప్రభాస్ పై కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Kriti Sanon- Prabhas: కృతి సనన్-ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి కొన్ని పరిణామాలు కారణమయ్యాయి. బేడియా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి సనన్, వరుణ్ ధావన్ ల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఓ షోకి వీరిద్దరూ గెస్ట్స్ గా వచ్చారు. వీరితో కరణ్ జోహార్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంలో వరుణ్ ధావన్ ఓ కామెంట్ చేశారు. కృతి సనన్ ఒకరి మనసులో ఉంది. ఆయన ముంబైలో లేరు. దీపికా పదుకొనెతో పాటు వేరొక చోట షూటింగ్ చేస్తున్నాడని అన్నాడు.

వరుణ్ ధావన్ పేరు చెప్పకపోయినా ఆయన ప్రభాస్ ని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారుని పలువురు భావించారు. అదే సమయంలో ప్రభాస్-దీపికా పదుకొనె హైదరాబాద్ లో ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాబట్టి వరుణ్ ధావన్ కృతి సనన్-ప్రభాస్ పెళ్లిపై ఆ విధంగా హింట్ ఇచ్చాడని భావించారు. ఇక వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు పలుమార్లు ట్వీట్స్ వేశాడు. త్వరలో మాల్దీవ్స్ లో కృతి సనన్ ప్రభాస్ నిశ్చితార్థం అని కన్ఫర్మ్ చేశాడు.

అప్పట్లో ప్రభాస్, కృతి ఎఫైర్ రూమర్స్ గురించి బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే ఈ వార్తలను కృతి సనన్ ఖండించారు. ఇక జూన్ 6న తిరుపతి వేదికగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరైన కృతి సనన్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతారని అందరూ అంటారు. అది నిజం కాదు ఆయన గలగలా మాట్లాడుతూనే ఉంటారు. ప్రభాస్ స్వీట్ పర్సన్. దయగల వ్యక్తి. భోజన ప్రియుడు.

ప్రభాస్ కళ్ళలో ఒక ప్రశాంతత ఉంటుంది. రాఘవుడు పాత్ర ఆయన తప్ప మరొకరు చేయలేరని పొగడ్తలతో ముంచెత్తారు. కృతి సనన్ మరోసారి ప్రభాస్ పై తన ప్రేమను చాటుకుంది. ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలో కృతి సనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ జానకి పాత్ర చేసిన విషయం తెలిసిందే.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు