Krithi Shetty: టీనేజ్ లోనే సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది కృతి శెట్టి. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో మామూలు ఫాలోయింగ్ లేదు. ఉప్పెన చిత్రం ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది. అబ్బాయిల కలల రాణిగా మారింది. బాల్యంలోనే మోడలింగ్ చేసింది కృతి శెట్టి. ఆమె కొన్ని యాడ్స్ లో నటించారు. హ్రితిక్ రోషన్ సూపర్ హిట్ బయోపిక్ సూపర్ 30 లో స్టూడెంట్ రోల్ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన యంగ్ స్టూడెంట్ రోల్ కి కృతి కరెక్ట్ గా సెట్ అవుతుందని నమ్మాడు. బుచ్చిబాబు సెలక్షన్ అద్భుతమని మూవీ విడుదలయ్యాక తెలిసింది.

Krithi Shetty
2021లో విడుదలైన ఉప్పెన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎమోషనల్ లవ్ డ్రామాను హృద్యంగా తెరకెక్కించారు బుచ్చిబాబు. క్లైమాక్స్ భిన్నంగా రాసుకున్నారు. దేవిశ్రీ సాంగ్స్ సినిమా విజయంలో కీలకమయ్యాయి. మొత్తంగా ఉప్పెన ఓ స్టార్ హీరో రేంజ్ వసూళ్లు సాధించింది. ఉప్పెన విజయంతో కృతి శెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. జోరు కొనసాగిస్తూ కృతి వరుస హిట్స్ ఇచ్చారు. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది.

Krithi Shetty
అరంగేట్రంతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన అరుదైన హీరోయిన్స్ జాబితాలో కృతి శెట్టికి చోటు దక్కింది. అయితే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన కృతి శెట్టి హ్యాట్రిక్ ప్లాప్స్ కూడా ఇచ్చారు. బంగార్రాజు తర్వాత కృతి నటించిన మూడు చిత్రాలు పరాజయం పొందాయి. రామ్ తో చేసిన వారియర్, నితిన్ తో జతకట్టిన మాచర్ల నియోజకవర్గం అంచనాలు అందుకోలేదు. సుధీర్ హీరోగా తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం అయితే చెత్త మూవీగా పేరు తెచ్చుకుంది.

Krithi Shetty
దీంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ నాగ చైతన్య మూవీ మీదే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ చిత్రంలో కృతి శెట్టి నటిస్తుంది. ఓ సీరియస్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న కస్టడీ మూవీలో కృతి శెట్టి గతంలో ఎన్నడూ చేయని భిన్నమైన రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కటకాల మధ్య కీర్తి ఇంటెన్స్ లుక్ ఆసక్తి రేపింది.
అలాగే ఓ మలయాళ చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు. కాగా కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అమ్మడు కొంచెం గ్లామర్ డోస్ పెంచారు. కసి చూపులతో కుర్రకారు గుండెలు కోశారు. కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు.