Krithi Shetty: నానితో మనస్ఫూర్తిగా నటించలేకపోయాను, నాకు నచ్చలేదు..!
బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. పుష్పలో సమంత చేసిన ‘ఊ అంటావా మామా’ వంటి ఐటమ్ నంబర్ చేస్తారా? అని అడగ్గా… ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Krithi Shetty: శ్యామ్ సింగరాయ్ మూవీ కృతి శెట్టి కెరీర్లో విజయవంతమైన చిత్రంగా ఉంది. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుంది. నాని హీరోగా నటించారు. ఆయన రెండు భిన్నమైన గెటప్స్ లో అలరించారు. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటించింది. దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కాగా ఈ మూవీలో కృతి శెట్టి-నాని మధ్య కొన్ని బెడ్ రూమ్ సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ కట్ లో కూడా ఇవి చూపించగా… కృతి ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటని పలువురు వాపోయారు.
బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. పుష్పలో సమంత చేసిన ‘ఊ అంటావా మామా’ వంటి ఐటమ్ నంబర్ చేస్తారా? అని అడగ్గా… ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాంటి సాంగ్స్ ప్రస్తుతం చేసే ఆలోచన లేదు. ఎందుకంటే నాకు వాటిపై అవగాహన కూడా లేదు. చెప్పాలంటే అసౌకర్యంగా అనిపిస్తే చేయలేను. శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా బోల్డ్ సన్నివేశాల్లో మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చని పనులు చేయకూడని అప్పుడే నిర్ణయించుకున్నాను.
ఇక ఊ అంటావా మామా పాట విషయానికి వస్తే, సమంత ఒక ఫైర్. ఆమె అద్భుతంగా డాన్స్ చేశారు… అని కృతి శెట్టి అన్నారు. కృతి శెట్టి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య మీద కోపంతో సమంత ఊ అంటావా మామా చేశారనే ప్రచారం జరిగింది. విడాకులు ప్రకటించిన కొత్తల్లో ఆమె ఈ సాంగ్ చేశారు. సన్నిహితులు ఐటెం సాంగ్ చేయవద్దని వారించారట. విడాకులు ప్రకటించిన వెంటనే ఇలాంటి సాంగ్ చేయడం వలన బ్యాడ్ ఇమేజ్ వస్తుందన్నారట. ఈ విషయాన్ని శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో సమంత చెప్పారు.
ఇక కృతి శెట్టి కెరీర్ ప్రమాదంలో పడింది. కస్టడీ సైతం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అంటే వరుసగా ఆమెకు నాలుగో పరాజయం. తెలుగులో కృతికి ఆఫర్స్ రావడం కష్టమే అన్న మాట వినిపిస్తోంది. ఉప్పెనతో సెన్సేషన్ చేసిన కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. అనంతరం నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పరాజయం పొందాయి. తాజాగా కస్టడీ సైతం నిరాశపరిచింది.
