Komatireddy Venkatreddy : ఎవడిదిరా బానిసత్వ పార్టీ? కేటీఆర్ పై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కేటీఆర్ బానిసత్వపు మాటలపై పరుష వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అన్నారు.

Komatireddy Venkatreddy : బీజేపీపై టోన్ తగ్గించి.. కాంగ్రెస్ పై పడుతున్న కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఓ రకంగా విరుచుకుపడ్డారు. కేటీఆర్ బానిసత్వపు మాటలపై పరుష వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అన్నారు. మేం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని.. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడని విమర్శించాడు. ‘ఎవడిదిరా బానిసత్వ పార్టీ’ అంటూ కేటీఆర్ పై దుమ్మెత్తిపోశారు.
వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘కేటీఆర్ అమిత్ షా ని కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయింది. కేటీఆర్ కి కొంత నాజెడ్జ్ ఉంది అనుకున్నా. ఈరోజు చిట్ చాట్ తర్వాత కేటీఆర్ కి ఏం తెలియదని అర్థమైంది. కేసీఆర్ కి దమ్ముంటే ఆయన్ని బండ భూతులు తిట్టినా దానం, తలసాని ని కేబినెట్ నుండి తీసేయాలి. మీ పార్టీ నుండి తెలంగాణ ద్రోహులను తీసేయండి.’ అంటూ సవాల్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర .1% అని.. కేసీఆర్ 115 మందిని ప్రకటించి ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చి పంపారని కోమటిరెడ్డి ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మేం తెలంగాణ కోసం కొట్లాడినాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలి. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారు. సోనియా పాత్ర లేదని కేటీఆర్ అంటున్నాడు.. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చింది. సోనియా పై కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదు’ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో ఒకటవ తారీఖున పింఛన్లు వచ్చేవి. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిందో చెప్పాలి ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు. దానం నాగేందర్ కట్టే పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడు. అరేయ్ కేసీఆర్ ఫుట్ బాల్ లాగా తంతాను అన్న తలసాని మంత్రి ఎలా అయ్యాడు?
తెలంగాణ ద్రోహులను నీ పార్టీలో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? పార్లమెంట్ లో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడాడా? అంటూ కోమటిరెడ్డి కడిగిపారేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారని.. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్ష్ ముఖ్యమంత్రి అవుతాడన్నారు. ‘మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాడు’ అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ ఏమయింది? దళితబందు, బీసీ బందులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నాను
