పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి జంప్!

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న పాత నల్గొండ జిల్లాలో బలమైన పట్టు గల కోమటిరెడ్డి సోదరులు ఆ పార్టీలో కొనసాగే విషయమై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా ఎవ్వరిని నీయయించినా కలసి పనిచేస్తామని చెప్పుకొంటూ వస్తున్న ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలం రెడ్డి నోటా ఇప్పుడు పార్టీ మార్పు గురించి మాట్లాడు వెలువడుతున్నాయి. ఈ సారి పిసిసి అధ్యక్ష పదవి తమకు రాని పక్షంలో బీజేపీలో చేరాడమొ […]

  • Written By: Neelambaram
  • Published On:
పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కోమటిరెడ్డి జంప్!

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న పాత నల్గొండ జిల్లాలో బలమైన పట్టు గల కోమటిరెడ్డి సోదరులు ఆ పార్టీలో కొనసాగే విషయమై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి వరకు పిసిసి అధ్యక్షుడిగా ఎవ్వరిని నీయయించినా కలసి పనిచేస్తామని చెప్పుకొంటూ వస్తున్న ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలం రెడ్డి నోటా ఇప్పుడు పార్టీ మార్పు గురించి మాట్లాడు వెలువడుతున్నాయి.

ఈ సారి పిసిసి అధ్యక్ష పదవి తమకు రాని పక్షంలో బీజేపీలో చేరాడమొ లేదా సొంతంగా పార్టీ పెట్టుకోవడమే చేస్తామని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పిసిసి నాయకత్వం కోసం కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టడం తెలిసిందే. రాజగోపాలరెడ్డి అన్నగారైన వెంకటరెడ్డి సూర్యాపేట ఎంపీగా ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరడానికి కోమటిరెడ్డి సోదరులు రంగం సిద్ధం చేసుకున్నా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువనే భావనతో ఇక్కడే ఉండిపోయారు.

ప్రస్తుత పిసిసి అధినేత ఉత్తమకుమార్ రెడ్డి నాయకత్వంలో వరుసగా కాంగ్రెస్ పార్టీ పరాజయాలను ఎదుర్కొంటూ, తెలంగాణాలో పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్నా ఆయనను మార్చడానికి పార్టీ అధిష్టానం కాలయాపన చేస్తూ ఉండడం పట్ల కోమటిరెడ్డి సోదరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికి కనీసం రెండు సార్లు పిసిసి అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు చేసి, మధ్యలో ఆగిపోవడం తెలిసిందే. తెలంగాణలో టి ఆర్ ఎస్ ను ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీని అధికారమలోకి తీసుకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నదని చెబుతూ, అందుకు తమకు పార్టీ నాయకత్వం ఇవ్వడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని చెబుతూ సీఎం కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గొప్పతనం వల్ల గెలువలేదు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల కారణంగానే కేసీఆర్ గెలిచారని అంటూ కాంగ్రెస్ పార్టీ నేడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేసారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు