
Kohli
Kohli: టీమిండియా అద్భుతమైన బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. తన బ్యాట్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. సచిన్ టెండుల్కర్ తరువాత అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తన బ్యాట్ తో సమాధానం చెప్పడమే కోహ్లి లక్ష్యం. అందుకే కోహ్లిని ఔట్ చేస్తే టీంపై ఆధిపత్యం చెలాయించినట్లే భావిస్తారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిని ఇబ్బంది పెట్టాలని చాలా మంది అనుకున్నా కుదరలేదు. దీంతో విరాట్ గట్స్ ఏంటో తెలుస్తోంది.
కొంతకాలం ఫామ్ లో లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నా తరువాత లైన్ లోకి వచ్చాడు. సెంచరీలు బాదేస్తున్నాడు. కోహ్లి బ్యాటింగ్ ను ఎదుర్కోవడం అంత సులువేం కాదు. గతంలో అండర్సన్, జంపా, నాథన్ లయన్ వంటి బౌలర్లు కోహ్లిని కాస్త ఇబ్బంది పెట్టినా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ సందర్భంగా నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా బుమ్రా వేసిన బౌలింగ్ ను కోహ్లి ఎదుర్కోలేకపోయాడు. నేరుగా కోచ్ వద్దకు వెళ్లి వాడి బౌలింగ్ లో కష్టంగా ఉంది. బాల్ ఎప్పుడు వేస్తున్నాడో తెలియడం లేదని కోహ్లి చెప్పడం గమనార్హం.
దీంతో బుమ్రా బౌలింగ్ ఏంటో అందరికి అర్థమైంది. మనకు కూడా ఓ మంచి బౌలర్ ఉన్నాడనే విషయం తరువాత తెలిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బుమ్రా గాయం కారణంగా టీమిండియా జట్టులో లేడు. ఎవరి బౌలింగ్ లోనూ ఇబ్బంది పడని కోహ్లి బుమ్రా బౌలింగ్ లో తడబడటంతో బుమ్రా స్టామినా ఏంటో తెలిసింది. కానీ బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటే బాగుండని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Kohli
గురువారం నుంచి నాగపూర్ వేదికగా ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఏ మేరకు విజయం సాధిస్తుందోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియా పటిష్టంగా లేకపోవడంతో టీమిండియా విజయం తథ్యమనే వాదనలు కూడా వస్తున్నాయి. సొంత గడ్డపై కంగారూలను ఓడించాలని టీమిండియా భావిస్తోంది. ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. కంగారూలను కట్టడి చేసి టెస్ట్ విజయం సొంతం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.