Dhoni-Kohli: ధోనీని కాపీ కొడుతున్న కోహ్లీ.. వారిని కాపీ కొట్టే ప్రయత్నంలో పాక్‌ బోల్తా!

కోహ్లీ క్రికెట్‌లో కొన్ని షాట్ల విషయంలోనూ ధోనీని తలపిస్తాడు. ముఖ్యంగా స్వీప్, సిక్స్‌ కొట్టిన సందర్భాల్లో, ఫ్రంట్‌కు వచ్చి ఆడిన సమయాల్లో కొన్ని షాట్లు ధోనీ, కోహ్లీ ఒకేలా ఉన్నాయి.

  • Written By: Neelambaram
  • Published On:
Dhoni-Kohli: ధోనీని కాపీ కొడుతున్న కోహ్లీ.. వారిని కాపీ కొట్టే ప్రయత్నంలో పాక్‌ బోల్తా!

Dhoni-Kohli: కొన్నేళ్లుగా ధోనీ తెల్లగడ్డంతో కనిపిస్తున్నాడు. అయినా స్టైల్‌గా కనిపిస్తూ సోషల్‌ మీడియాను దున్నేస్తున్నాడు. ఇప్పుడు గడ్డం విషయంలో ధోనీని కోహ్లీ కాపీ కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ భార్య అనుష్కశర్మ ఓ ఫోటోను షేర్‌ చేసింది. అందులో విరాట్‌ కోహ్లీ కూడా తెల్ల గడ్డంతో కనిపించాడు. దీంతో పలువురు లుక్‌ విషయంలో ధోనీని విరాట్‌ కోహ్లీ కాపీ కొడుతున్నాడని కామెంట్లు పోస్ట్‌ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌..
క్రికెట్‌ దిగ్గజాలుగా గుర్తింపు ఉన్న ధోనీ, కోహ్లీకి ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌కు మాత్రం పరిమితమయ్యాడు. కోహ్లీ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీల మీద సెంచరీలతో అదరగొడుతున్నాడు. వీళ్లిద్దరూ కెప్టెన్ గా రాణించి టీమిండియాకు అద్భుత విజయాలను అందించారు. ధోనీ అయితే మూడు ఐసీసీ టైటిళ్లను కూడా అందజేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ పలికినా అతడి క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

ఆటలోనూ ధోనీలా..
ఇక కోహ్లీ క్రికెట్‌లో కొన్ని షాట్ల విషయంలోనూ ధోనీని తలపిస్తాడు. ముఖ్యంగా స్వీప్, సిక్స్‌ కొట్టిన సందర్భాల్లో, ఫ్రంట్‌కు వచ్చి ఆడిన సమయాల్లో కొన్ని షాట్లు ధోనీ, కోహ్లీ ఒకేలా ఉన్నాయి. దీంతో కోహ్లీ ధోనీని కాపీ కొడుతున్నారని అంటారు. ఇప్పుడు గడ్డం విషయంలోనూ కోహ్లీ ధోనీని ఫాలో అవుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సోషల్‌ మీడియాలో..
ఇక ఇప్పుడు ధోనీ, కోహ్లీ సేమ్‌ షాట్లతోపాటు, పాకిస్తాన్‌ క్రికెటర్‌ వారిని అనుకరించే క్రమంలో కింపడిపోయిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలో క్రీజ్‌లో ఫ్రంట్‌కువచ్చిన ఆడిప్పుడు ధోనీ, కోహ్లీ స్టిల్‌ ఒకేటా ఉన్నాయి. పైన ధోనీ స్వీప్‌ షాట్, కింద కోహ్లీ స్వీప్‌షాట్‌ ఉండగా, దానికింద పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఫొటో ఉంది. దీనికి నెటిజన్లు క్యాప్షన్‌ ఇచ్చారు. రియల్, కాపీడ్, మేడిన్‌ చైనా పేరుతో ఈ ఫొటో వైరల్‌ చేస్తున్నారు. ధోనీ, కోహ్లీని అనుకరించేలా పాకిస్తాన్‌ క్రికెటర్‌ చేసిన ప్రయత్నం మేడిన్‌ చైనాలా ఉందంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు