Kodali Nani : తనకి క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తలపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

తనకి క్యాన్సర్ అని వార్త రాగానే తన అభిమానులు , సన్నిహితుల నుండి భారీ ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చాయట. నా చిరకాల మిత్రుడు ఫోన్ చేసి చెప్తే కానీ ఈ విషయం తెలియలేదని, తెలుగు దేశం పార్టీ కి ఇలాంటి విష ప్రచారాలు చెయ్యడం కొత్తేమి కాదని, వాళ్ళ బ్రతుకే ఇంత అని చెప్పొచ్చాడు కొడాలి నాని.

  • Written By: NARESH
  • Published On:
Kodali Nani : తనకి క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తలపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

Kodali Nani : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని కి క్యాన్సర్ అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇది నిజమో కాదో తెలియక వైసీపీ పార్టీ శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేసారు. అపోలో హాస్పిటల్ లో కొడాలి నాని చికిత్స తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే దీనిపై కొడాలి నాని చాలా తీవ్రంగా స్పందించాడు.

తనకి ఎలాంటి క్యాన్సర్ లేదని, చాలా ఆరోగ్యకరంగా ఉన్నానని, టీడీపీ పార్టీ కి చెందిన సోషల్ మీడియా వింగ్ ఇలాంటి అసత్య ప్రచారాలను చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఇక నుండి ఇలాంటి వార్తలు ప్రచారం చెయ్యడం ఆపకపోతే కఠినమైన చర్యలు తప్పవని కొడాలి నాని హెచ్చరించాడు. చంద్ర బాబు నాయుడు ని ఆంధ్ర ప్రదేశ్ నుండి తన ఇంటికి పంపే వరకు నేను ఈ భూమి మీదనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

తనకి క్యాన్సర్ అని వార్త రాగానే తన అభిమానులు , సన్నిహితుల నుండి భారీ ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చాయట. నా చిరకాల మిత్రుడు ఫోన్ చేసి చెప్తే కానీ ఈ విషయం తెలియలేదని, తెలుగు దేశం పార్టీ కి ఇలాంటి విష ప్రచారాలు చెయ్యడం కొత్తేమి కాదని, వాళ్ళ బ్రతుకే ఇంత అని చెప్పొచ్చాడు కొడాలి నాని.

ఇక తమ ప్రియతమా నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల పై మరియు కార్యకర్తల పై కొడాలి నాని మరియు వైసీపీ అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా లో చంద్ర బాబు ని ట్యాగ్ చేస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఇలాంటి నీచపు రాజకీయాలు చెయ్యడం ఆపకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి వీటిపై తెలుగు దేశం పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు