Gas Trouble: గ్యాస్ ట్రబుల్ ఎలా తగ్గించుకోవాలో తెలుసా?
పొట్టలో గ్యాస్ ఫామ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆహారం ఎలా తినాలి? మనం తినే ఆహారాన్ని మెల్లగా నమిలి తినాలి. దీంతో అది జీర్ణం కావడానికి ఆస్కారం ఉంటుంది. తొందరపాటులో మనం సరిగా నమలకపోతే అదిపొట్టలోనే అలాగే ఉండిపోతుంది. దీంతో జీర్ణం కాక ఇబ్బందులు పడతాయి. ఆ ఇబ్బందులేవో తినే సమయంలోనే పడితే సమస్య రాదు.

Gas Trouble: మనకు ప్రస్తుతం వచ్చే రోగాల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటి. మనం ఆహారం తీసుకునే క్రమంలో సరిగా నమలకపోతే గ్యాస్ సమస్య వస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో మనం తొందరగా ఆహారం తీసుకుంటున్నాం. దీంతో మన కడుపు ఉబ్బరంగా ఉంటుంది. తేన్పులు రావడం జరుగుతుంది. గ్యాస్ సమస్య రావడానికి మనం తీసుకునే ఆహారం కూడా కారణం కావచ్చు.
పొట్టలో గ్యాస్ ఫామ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆహారం ఎలా తినాలి? మనం తినే ఆహారాన్ని మెల్లగా నమిలి తినాలి. దీంతో అది జీర్ణం కావడానికి ఆస్కారం ఉంటుంది. తొందరపాటులో మనం సరిగా నమలకపోతే అదిపొట్టలోనే అలాగే ఉండిపోతుంది. దీంతో జీర్ణం కాక ఇబ్బందులు పడతాయి. ఆ ఇబ్బందులేవో తినే సమయంలోనే పడితే సమస్య రాదు.
మనం చేసే తప్పులే మనకు ప్రతికూలంగా మారతాయి. తినే సమయంలో బాగా నమిలి మింగటం వల్ల అది కడుపులో త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. కానీ మనం నమలకపోతేనే నష్టం. తినే సమయంలో లాలజలంతో కలిసి మనం తిన్న పదార్థం పొట్టలోకి వెళ్తుంది. అక్కడ తేలికగా ఉంటే త్వరగా జీర్ణం అవుతుంది.
అలా లేకపోతే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇలా మనం తినే సమయంలో మెత్తగా చేస్తే దాంతో మనకు ఎలాంటి సమస్యలు రావు. ఈ విషయం తెలియని చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం తినే ఆహారం అరటిపండు గుజ్జులా మెత్తగా మారితేనే మంచిది. దీంతో అది ఎక్కడ ఆగకుండా వెళ్లి జీర్ణం అయి మనకు శక్తిని ఇస్తుంది.