Varun Lavanya Marriage: వరుణ్-లావణ్య పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా క్లిన్ కార… మనవరాలితో చిరు దంపతులు!

లలితా సహస్రనామం లోని ఒక పదమైన క్లిన్ కారను చిరంజీవి మనవరాలికి పేరుగా ఎంచుకున్నారు. బహుశా ఈ పేరు మరొకరికి ఉండే అవకాశం లేదు. అంతటి అరుదైన పేరును మనవారికి పెట్టారు చిరంజీవి.

  • Written By: NARESH
  • Published On:
Varun Lavanya Marriage: వరుణ్-లావణ్య పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా క్లిన్ కార… మనవరాలితో చిరు దంపతులు!

Varun Lavanya Marriage: వరుణ్-లావణ్య త్రిపాఠి వివాహంలో మెగా కిడ్ క్లిన్ కార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబ సభ్యులతో పాటు ఆమె క్లిన్ కార కూడా ఫోటోలకు ఫోజిచ్చింది. ఒకవైపు పెళ్లిని ఎంజాయ్ చేస్తూనే క్లిన్ కారను అల్లారుముద్దుగా ఆటలాడించారు కుటుంబ సభ్యులు. జూన్ 20న క్లిన్ కార హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జన్మించింది. ఉపాసన-రామ్ చరణ్ దంపతుల మొదటి సంతానమైన క్లిన్ కార ఆకాశమంత ఆనందం నింపింది. క్లిన్ కార బారసాల ఘనంగా జరిపారు.

లలితా సహస్రనామం లోని ఒక పదమైన క్లిన్ కారను చిరంజీవి మనవరాలికి పేరుగా ఎంచుకున్నారు. బహుశా ఈ పేరు మరొకరికి ఉండే అవకాశం లేదు. అంతటి అరుదైన పేరును మనవారికి పెట్టారు చిరంజీవి. ఇదిలా ఉంటే క్లిన్ కార మొదటిసారి విదేశీయానం చేసింది. ఇటలీలో జరిగిన వరుణ్-లావణ్యల వివాహానికి రామ్ చరణ్-ఉపాసన హాజరైన విషయం తెలిసిందే. వారు కూతురు క్లిన్ కారను కూడా పెళ్ళికి తీసుకొచ్చారు.

ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. దీంతో పెళ్లిలో క్లిన్ కారతో వారు సందడిగా గడిపారు. ఇక నాన్నమ్మ సురేఖ, తాతయ్య చిరంజీవి క్లిన్ కారను ముద్దు చేస్తున్న అద్భుతమైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాన్నమ్మ తాతయ్యలతో క్లిన్ కార అంటూ వైరల్ చేస్తున్నారు. మనవరాలిని చూసి చిరు దంపతులు మురిసిపోవడం గొప్పగా ఉంది. నవంబర్ 1న వరుణ్ తేజ్ పెళ్లి ముగిసిన నేపథ్యంలో ఇండియాకు మెగా ఫ్యామిలీ రానుంది.

ఇటలీలో పెళ్ళికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందుకే నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. దాదాపు ఐదేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్-లావణ్య పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. యూపీకి చెందిన లావణ్య మెగా కోడలు అయ్యింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు