Nenu Meeku Baaga Kavalsinavaadini: కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. సినీ ప్రముఖుల కోసం ఈ సినిమా ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో ప్రివ్యూ రివ్యూ చూద్దాం.

Kiran Abbavaram
కథాకమామీషుకి వస్తే..
కిరణ్ అబ్బవరం చదువులో ఫెయిల్ అయ్యి.. ఇక అన్ని వదిలేసి ఖాళీగా తిరుగుతూ తాగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. ఈ క్రమంలో డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. జీవితంలో ఎదగాలని కలలు కంటూ ఉంటాడు . ఈ క్రమంలో సంజనా ఆనంద్ తో పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడటం కూడా జరిగిపోతాయి. మరి వీరి మధ్యలోకి సిద్ధార్థ్ మీనా ఎలా ఎంట్రీ ఇచ్చింది ? చివరకు కిరణ్ తన ప్రేమలో అలాగే జీవితంలో కూడా ఎలా సక్సెస్ అయ్యాడు ? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం..లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. ఫెయిల్ అయి ఖాళీగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకండాఫ్ లో హీరోయిన్ సంజనా ఆనంద్ కి తన ప్రేమను తెలియజేసే సన్నివేశంలో గాని కిరణ్ అబ్బవరం చాలా బాగా నటించాడు.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంజనా ఆనంద్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో సంజనా ఆనంద్ మెప్పించింది. మరో హీరోయిన్ సిద్ధార్థ్ మీనా కూడా చాలా బాగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. దర్శకుడు శ్రీధర్ గాదె సక్సెస్ కు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు.

Kiran Abbavaram
కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను మాత్రం రాసుకోలేదు శ్రీధర్ గాదె. అసలు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ తాలూకు సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉండవు. దీనికి తోడు కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా సాగుతాయి. ప్రస్తుతం ఓటీటీల్లో ఎన్నో గొప్ప సినిమాలు అందుబాటులో ఉండగా.. ఇలాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమా కోసం థియేటర్ కి వెళ్లి చూడటం వృధానే. కాబట్టి ప్రివ్యూ రివ్యూ ప్రకారం ఈ సినిమా బాగాలేదు.