King Of Kotha Review: కింగ్ ఆఫ్ కొత్త రివ్యూ : దుల్కర్ సల్మాన్ మాస్ మూవీ
కంటెంట్ ఉంటే చాలు ఏ భాష చిత్రమైన అన్ని భాషల్లో హిట్ అయిపోతుంది. దుల్కర్ సల్మాన్ కు మలయాళం లోనే కాక తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. గత కొంతకాలంగా మలయాళం సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది.

King Of Kotha Review: మూవీ : కింగ్ ఆఫ్ కొత్త
నటీనటులు : దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డ్యాన్స్ రోజ్ షబీర్.
నిర్మాత : దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్
డైరెక్షన్ : అభిలాష్ జోషి
మ్యూజిక్ : జేక్స్ బిజోయ్
రిలీజ్ డేట్: ఆగస్ట్ 24, 2023
మహానటి, సీతారామం మూవీస్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు దుల్కర్ సల్మాన్. ఈరోజు అతను నటించిన కింగ్ ఆఫ్ కొత్త అనే సరికొత్త మాస్ మూవీ విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ మాస్ కథ చిత్రం ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం…
స్టోరీ :
కింగ్ ఆఫ్ కొత్త చిత్రం 1980 కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ కుర్రాడు జీవితంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా అతను ఎవరు ఊహించని విధంగా ఊరినే శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. స్వతహాగా మంచి ఫుట్బాల్ ప్లేయర్ అయిన రాజు ( దుల్కర్ సల్మాన్) కొన్ని కారణాలవల్ల అనుకోని విధంగా సమస్యల్లో ఇరుక్కుంటాడు. వాటిని పరిష్కరించే క్రమంలో ఊరినే శాసించే లీడర్ గా మారుతాడు. అసలు అతని జీవితంలో పెను మార్పు చూపు చేసుకోవడానికి కారణం ఏమిటి ? అనేది మాత్రం స్క్రీన్ పై చూడాల్సిందే.
రివ్యూ :
కంటెంట్ ఉంటే చాలు ఏ భాష చిత్రమైన అన్ని భాషల్లో హిట్ అయిపోతుంది. దుల్కర్ సల్మాన్ కు మలయాళం లోనే కాక తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. గత కొంతకాలంగా మలయాళం సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది.. వీటన్నిటి దృశ్య కింగ్ ఆఫ్ కొత్త మూవీ కేవలం మలయాళం లోనే కాకుండా తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ మూవీ స్టోరీ లో పెద్ద కొత్తదనం ఏమీ లేదు, కంటెంట్ కూడా చాలా రెగ్యులర్ గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తో ఇంతకుముందే చాలా మూవీస్ వచ్చాయి. అయితే మూవీ నరేష్ కాస్త డిఫరెంట్ గా ఉంది అని చెప్పవచ్చు. రొటీన్ కి భిన్నంగా జరిగే అంత పెద్ద ట్విస్టులు ఈ చిత్రంలో ఏమీ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ లోని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో సరిపోతుంది. అసలు కథ మొదలయ్యేది సెకండ్ హాఫ్ లోనే. కానీ సెకండ్ హాఫ్ నేరేషన్ చాలా స్లోగా సాగుతుంది.
మూవీ స్లోగా ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ అయితే అనిపించదు. రాజు క్యారెక్టర్ కి దుల్కర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ మూవీలో ఉన్న మరొక స్ట్రాంగ్ క్యారెక్టర్
నైలా ఉష పోషించిన పాత్ర. మూవీకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. సీన్ కి తగ్గట్టుగా కరెక్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ కోసం వేసిన సెట్స్ కూడా ఎగ్జాక్ట్ 1980 కాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో.. అదేవిధంగా చాలా నేచురల్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఈ మూవీలో ప్రతి యాక్టర్ తన వంతు పాత్ర ఎంతో పర్ఫెక్ట్ గా ప్లే చేశారు.
మూవీకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్ బోన్.
సినిమాటోగ్రఫీ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది.
యాక్షన్స్ సన్నివేశాలు చాలా నాచురల్ గా సిచువేషన్ కి బాగా సింక్ అయ్యే విధంగా డిజైన్ చేశారు.
మైనస్ పాయింట్స్:
మూవీ స్టోరీ కొత్తదనం లేకుండా రొటీన్ గా ఉంటుంది.
సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది.
చివరి మాట:
మీకు పాత శివ, ఘర్షణ లాంటి మూవీస్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ మూవీ బెస్ట్. 1980 కథనంతో చాలా స్లో నరేషన్తో సాగే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా కింగ్ ఆఫ్ కొత్త ఉంటుంది.
రేటింగ్ : 3/5
