King Charles Coronation : రాజ్యాలు.. రాచరికం పోయినా.. ఈ రాజు పట్టాభిషేకం మాత్రం వైరల్

1948 నవంబర్ 14న చార్లెస్_3  జన్మించారు. ఇంత పెద్ద వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టారు. కేం బ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 1970లో డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ అందుకున్న తొలి రాజుగా ఆయన నిలిచారు.

  • Written By: Bhaskar
  • Published On:
King Charles Coronation : రాజ్యాలు.. రాచరికం పోయినా.. ఈ రాజు పట్టాభిషేకం మాత్రం వైరల్

King Charles Coronation : అతిథి మర్యాదల్లో, రాజరికపు పోకడల్లో, ఠీవీ ప్రదర్శనల్లో ఏమాత్రం తగ్గలేదు. వచ్చిన అతిథులకు ఎక్కడా లోటు రానియలేదు. వేలాదిమంది విదేశీ ప్రతినిధులు హాజరైన వేళ.. బ్రిటన్ రాజు చార్లెస్ _3 పట్టాభిషేకం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే లో ఘనంగా జరిగింది. 74 సంవత్సరాల రాజుకు ఆర్చి బిషప్ కిరీట ధారణ చేశారు. దీంతో చార్లెస్ 40వ రాజుగా సింహాసనాన్ని అధిష్టించినట్టు అయింది.

వివిధ దేశాల నుంచి

ఈ కార్యక్రమానికి వివిధ దేశాల రాజ కుటుంబీకులు భారీగా తరలివచ్చారు. తొలుత రాజకుటుంబ సంప్రదాయం ప్రకారం సైనికులు వెంట నడిచారు. డైమండ్ జూబ్లీ గుర్రపు బగ్గిపై చార్లెస్, కెమిల్లా బకింగ్ హమ్ ప్యాలస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబే కు తరలివచ్చారు. 2.2 కిలోమీటర్ల దారి పొడవునా వేలాది మంది బ్రిటన్ జాతీయ జెండాలతో రాజుకు అభివాదం చేశారు. అబే పశ్చిమ ద్వారం నుంచి పట్టాభిషేకం జరిగే హాల్లోకి రాజు దంపతులు ప్రవేశించారు. పట్టాభిషేకం కార్యక్రమానికి తరలివచ్చిన 2,200 మంది అతిథులు ఆయనకు అభివాదం చేశారు. ఇందులో భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్, ఆయన సతీమణి సుదేష్ హాజరయ్యారు.

కాల్డ్ టు సర్వ్

పట్టాభిషేకంలో మొదటిదైన “కాల్డ్ టు సర్వ్” కార్యక్రమాన్ని హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దలతో కలిసి కౌంటర్ బరి ఆర్చి బిషప్ జస్టిన్ వెల్బీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిటన్ తొలి హిందూ ప్రధాని అయిన రిషి సునాక్ బైబిల్లో తొలి వాక్యాలు చదివారు. వెంటనే లాంఛనంగా రాజు, రాణి వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత చార్లెస్ ప్రమాణం చేశారు. బ్రిటన్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పిస్తా అని ప్రమాణం చేశారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు నమ్మకస్తుడైన క్రిస్టియన్ గా ఉంటానని ప్రమాణం చేశారు. ఆ తర్వాత బైబిల్ ను ముద్దాడారు.

కిరీట ధారణ ఇలా

1300 సంవత్సరంలో ఎడ్వర్డ్ చేయించిన సింహాసనాన్ని చార్లెస్ అదృష్టించారు. అనంతరం చార్లెస్ ను జెరూసలం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. ఈ ప్రక్రియ మొత్తం తెరచాటన జరిగింది. ఆ తర్వాత బంగారు తాపడంతో చేసిన మహారాజా సింహాసనంపై చార్లెస్ కూర్చున్నారు. అనంతరం సిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చి బిషప్ ఆయనకు అందించారు. కుడి చెయ్యి నాలుగో వేలుకు ఉంగరం తొడిగిన అనంతరం కిరీట ధారణ చేశారు. ఆ తర్వాత సభికులు మొత్తం “గాడ్ సేవ్ కింగ్” అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజు పట్టాభిషేక కుర్చీలో నుంచి లేచి రాజఖడ్గాన్ని పట్టుకొని ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సింహాసనం పై రాజ్ కూర్చోగానే ఆర్చి బిషప్ తో పాటు యువరాజు ప్రిన్స్ విలియం మోకాళ్ళపై వంగి రాజు కాళ్ళకు చేతిని ఆనించి ఆయన కుడి చేతిని ముద్దాడారు. ఆయన కుడి చేతిని ముద్దాడారు. అనంతరం 75 సంవత్సరాల రాణి కెమిల్లా పై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు. ఆమె ధరించిన కిరీటంలో కోహినూర్ మినహా 2,200 వజ్రాలను పొదిగారు. రెండు గంటలపాటు జరిగిన పట్టాభిషేకం కార్యక్రమం అబే గంటలు మోగడంతో పూర్తయింది. ఆ తర్వాత రాజు, రాణి అబే నుంచి బకింగ్ హామ్ ప్యాలెస్ కు బంగారు పూతతో ఉన్న గుర్రపు బగ్గిపై వెళ్లారు.

1066 నుంచి

ఇక వెస్ట్ మినిస్టర్ అబే 1066 నుంచి రాజుల పట్టాభిషేకానికి వేదికగా నిలుస్తోంది. అయితే ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ట్రాఫల్గర్ స్క్వేర్ వద్ద ” నాట్ మై కింగ్” అంటూ ఆందోళన చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పట్టాభిషేకం కార్యక్రమంలో బ్రిటిష్ అవార్డులు గెలుచుకున్న భారత సంతతికి చెందిన బన్సారీ రూపా రేలియా, మంజు మల్హి, సౌరబ్ ఫడ్కే, గల్ ష్షా, జే పటేల్ పాల్గొన్నారు. రాజు పట్టాభిషేకం సందర్భంగా గౌరవ సూచకంగా గగనతలంలో బ్రిటన్ వాయిస్ ఆయనకు చెందిన పదుల సంఖ్యలో విమానాలు విన్యాసాలు చేశాయి. 56 కామన్ వెల్త్ దేశాలకు చెందిన 240 కోట్ల మంది ప్రజలకు బ్రిటన్ రాజు అధిపతిగా ఉంటారు. ఇందులో భారత్ కూడా ఉంది.

డిగ్రీ పొందిన ఏకైక రాజు

1948 నవంబర్ 14న చార్లెస్_3  జన్మించారు. ఇంత పెద్ద వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టారు. కేం బ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 1970లో డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ అందుకున్న తొలి రాజుగా ఆయన నిలిచారు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్సులో పైలట్ శిక్షణ పొంది నౌక దళంలో పనిచేశారు. 1976 లో సైనిక సేవల నుంచి రిటైర్ అయ్యారు. మొదట డయానా అనే సామాన్య మహిళను పెళ్లాడారు. వారికి విలియం,హ్యారీ అనే పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డయానాకు విడాకులు ఇచ్చారు. 2005లో అప్పటి రాణి ఎలిజబెత్_2 అనుమతితో తన చిరకాల మిత్రురాలు కెమిల్లాను పెళ్లి చేసుకున్నారు. చార్లెస్_3 కన్నా కెమిల్లా ఏడాది పెద్ద. మరోవైపు రాజరికాన్ని వదులుకున్న చార్లెస్_3 కుమారుడు హ్యారీ పట్టాభిషేకానికి హాజరయ్యారు. ఆయన ఒంటరిగానే వచ్చారు. ఆయన భార్య మేఘన్ మేర్కెల్, ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండి పోయారు.. ఈ వేడుకలో తన సోదరులతో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కనిపించారు.

పూర్తి మతసామరస్యం

ఇక బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో పలు మతాలకు చెందిన ప్రతినిధులకు గుర్తింపునిచ్చేలా వారికి భాగస్వామ్యం కల్పించారు. కీలకమైన రాజ చిహ్నాన్ని బ్రిటన్ రాజు చార్లెస్_3 కి అందజేసే అవకాశం సిక్కులకు దక్కింది. సిక్కు ప్రతినిధిగా లార్డ్ ఇంద్రజిత్ సింగ్ కు ఈ గౌరవం లభించింది. ఇక భారత్_ గయానా మూలాలు ఉన్న లార్డ్ సయ్యద్ కమల్ ముస్లింల ప్రతినిధిగా వెళ్లి జత కంకణాలు అందజేశారు. హిందువుల తరఫున లార్డ్ నరేంద్ర బాబు భాయ్ పటేల్ ఉంగరాన్ని అందించారు. ఇక ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించిన 100, 50 పెన్స్ నాణాలు సిద్ధం చేశారు. వీటి విలువ 50 పౌండ్లు. వీటిపై రాజు ముఖచిత్రం ఉంది. ప్రతినిధుల సభ నేత పెన్ని మోర్టాండ్ ఈ నాణాల మూటను తీసుకువెళ్లి ఖడ్గాన్ని స్వీకరించారు. అలా తీసుకున్న తొలి మహిళగా కెమిల్లా రికార్డు సృష్టించారు. ఇక బ్రిటన్ రాజు చార్లెస్ కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Read Today's Latest International politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube