బాలలకు ప్రాణాంతకంగా బ్లడ్ కాన్సర్
భారత దేశంలో నేడు ఒక ప్రాణాంతక వ్యాధిగా మారుతున్న కాన్సర్ ముఖ్యంగా బాలల పట్ల అశనిపాతంగా మారుతున్నది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా భారత్ లోనే కాన్సర్ బాలలో సోకుతున్నది. భారత్ లో కాన్సర్ తో చనిపిస్తూన్న బాలల్లో 70 శాతం బ్లడ్ కాన్సర్ తో చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 15న జరిపే బాలల కాన్సర్ దినం సందర్భంగా అపోలో క్రెడిల్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణురాలు డా. షర్మిల ఈ విషయాలను తెలిపారు. భారత […]

భారత దేశంలో నేడు ఒక ప్రాణాంతక వ్యాధిగా మారుతున్న కాన్సర్ ముఖ్యంగా బాలల పట్ల అశనిపాతంగా మారుతున్నది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా భారత్ లోనే కాన్సర్ బాలలో సోకుతున్నది. భారత్ లో కాన్సర్ తో చనిపిస్తూన్న బాలల్లో 70 శాతం బ్లడ్ కాన్సర్ తో చనిపోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 15న జరిపే బాలల కాన్సర్ దినం సందర్భంగా అపోలో క్రెడిల్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణురాలు డా. షర్మిల ఈ విషయాలను తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గణాంకాల ప్రకారం భారత దేశంలో వచ్చే చిన్నారుల క్యాన్సర్లలలో ముఖ్యంగా 5 సంవత్సరములలోపూ చిన్నారులలో ఎక్కువగా 70 శాతం వరకు బ్లడ్ కాన్సర్ వస్తున్నదని ఆమె చెప్పారు.
భారత వైద్య పరిశోధన మండలి ప్రకారం దేశంలో11.57 లక్షల మంది కొత్త క్యాన్సర్ రోగులు నమోదు అవుతుంటే, 22.25 లక్షల మంది పాత రోగులు క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. 2018 గణాంకాల ప్రకారం అధికారికంగా 7.84 లక్షల మంది మంది క్యాన్సర్ తో మృత్యువాత పడ్డారని స్పష్టం అవుతోంది.
కాగా, పీడియాట్రిక్ ఆంకాలజీ వారు ప్రచురించిన దాని ప్రకారం ఏటా 0-19 లోపు చిన్నపిల్లలు 50 వేల మంది క్యాన్సర్ భారిన పడుతున్నారు. అంటే దేశ వ్యాప్తంగా వచ్చే క్యాన్సర్ కేసులలో 4.5 నుండి 5.5 శాతం కేసులు చిన్నారులవే ఉంటున్నాయని వీరు విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 2016 లో ప్రకటించిన వివరాల ప్రకారం ఏటా నగర ప్రాంతాలలో క్యాన్సర్ భారిన పడుతున్న చిన్నారుల సంఖ్య పైన పేర్కొన్న సగటు కన్నా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ఢిల్లీలో 4.5 శాతానికి మించి ఉన్నదని పేర్కొన్నారు.
ఇది పరిస్థితి తీవ్రతకు అద్దపడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చిన్నారులలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను త్వరగా గుర్తిస్తే నూటికి నూరు శాతం తగ్గించవచ్చని అయితే క్యాన్సర్ పై ఎక్కువ అవగాహన ఉన్న పాశ్చాత్య దేశాలలో క్యాన్సర్ వచ్చిన చిన్నారులలో 90 శాతం మందికి పూర్తిగా నయం చేయగలుగుతుంటే భారత్ లాంటి దేశాలలో ఈ సగటు 37 నుండి 40 శాతం మాత్రమే ఉంది. ఇందుకు ప్రధానంగా పేదరికమే కాకుండా అవగాహన లోపం కూడా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వైద్య శాస్త్ర పరంగా చిన్నారులలో వచ్చే క్యాన్సర్లను 90 శాతానికి పైగా తగ్గించవచ్చని పాశ్చాత్య దేశాలలో గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సకు చిన్నారులు త్వరగా స్పందించి కోలుకొనే సత్తా స్వతహాగా ఉంటుందని వారికి సరైన వైద్యం అందిస్తే పూర్తి స్థాయిలో తగ్గించవచ్చనే విషయం ఇప్పటికే స్పష్టమైందని డా. షర్మిల చెప్పారు. అయితే భారత్ లో 37 నుండి 40 శాతం బాలలకు మాత్రమే నయం అవుతున్నది.
భారత దేశంలో వ్యాధి ముదిరిన తర్వాతనే వైద్యులు గుర్తిస్తున్నారని, దాంతో వ్యాధి తగ్గించ లేకపోతున్నామనే విషయాన్ని అందరూ గుర్తించాలని డా. షర్మిల కోరారు. దీనికి భారత దేశంలో ఉన్న పేదరికం, నిరక్ష్యరాస్యతల కారణంగా ఏర్పడే అవగాహన లేమే ప్రధాన కారణమని అంటూ తద్వారా జరుగుతున్న ఈ పిల్లల మరణాలను అరికట్టడానికి ప్రజలలో విస్తృత ప్రచారం అవగాహన కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు.