Kiara Advani: పెళ్ళైన స్టార్ హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేసిన కైరా అద్వానీ

Kiara Advani: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కైరా అద్వానీ..ఈమె కాల్ షీట్స్ కోసం టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ మరియు స్టార్ హీరోలు ఎదురు చూస్తుంటారు..తెలుగు లో ఈమె ఇప్పటి వరుకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..ఇక బాలీవుడ్ లో అయితే […]

  • Written By: Neelambaram
  • Published On:
Kiara Advani: పెళ్ళైన స్టార్ హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేసిన కైరా అద్వానీ

Kiara Advani: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కైరా అద్వానీ..ఈమె కాల్ షీట్స్ కోసం టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ మరియు స్టార్ హీరోలు ఎదురు చూస్తుంటారు..తెలుగు లో ఈమె ఇప్పటి వరుకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..ఇక బాలీవుడ్ లో అయితే ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి..అర్జున్ రెడ్డి సినిమాని అక్కడ కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసారు..ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది..తెలుగులో కంటే కూడా ఈ సినిమా బాలీవుడ్ లో సెన్సషనల్ హిట్..సుమారు 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం..ఇక ఆ తర్వాత కూడా ఈమె చేసిన సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Kiara Advani

Kiara Advani

Also Read: Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ హీరోయిన్ బాలీవుడ్ లో వివాదాల్లోకి చిక్కుకుంది..ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా లో తనపై నెగటివిటీ పెంచుకుంది..ఇక అసలు విషయానికి వస్తే ఈమె ఇటీవలే ‘జగ్ జగ్ జియో’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది..వరుణ్ ధావన్ ఈ సినిమా లో హీరో గా నటించాడు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సుమారు 120 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..అయితే ఈ సినిమా సక్సెస్ మీట్స్ లో ఈ జంట తెగ హాజరు అవుతుంది..ఇటీవలే ఒక సక్సెస్ మీట్ లో మీడియా తో మాట్లాడిన తర్వాత కైరా అద్వానీ మరియు వరుణ్ ధావన్ మధ్య చిన్న ఫోటో షూట్ చేసారు..కైరా అద్వానీ మామూలుగానే ఫోటోలకు స్టిల్స్ ఇస్తున్న సమయం లో వరుణ్ ధావన్ కైరా అద్వానీ కి ముద్దు పెట్టి షాక్ కి గురి చేసాడు..ప్రస్తుతం ఈ సంఘటన బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..ఇక సోషల్ మీడియా లో అయితే నెటిజెన్స్ మీకు బయట చాలా సమయం ఉంటుంది కదా..అక్కడ ఇలాంటివి చేసుకోవచ్చు కదా..మాకు ఏంటి ఇది అని తిడుతున్నారు..మరి కొంతమంది నెటిజెన్స్ అయితే వరుణ్ ధావన్ ని టాగ్ చేసి నీకు ఇప్పటికే పెళ్లి అయ్యింది..మర్చిపోయావా ఆ విషయం అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Kiara Advani

Varun Dhawan, Kiara Advani

Also Read: Sai Pallavi: సినిమాలకు దూరం కానున్న సాయి పల్లవి?? ఫాన్స్ కి ఊహించని షాక్

Tags

    Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu
    oktelugu whatsapp channel
    follow us
    • facebook
    • instagram
    • twitter
    • youtube