TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ : అంతా జరిగాకా… ఇప్పుడు నిషేధమట

TSPSC: జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోవాల్సిన పరువు పోయింది. 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు నిలువునా కూలిపోయాయి. ఏళ్లకు ఏళ్ళు ప్రిపేర్ అయిన వారి కలలు కళ్ళలు అయిపోయాయి. ఇంక జరిగిన తర్వాత ఎప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేల్కొన్నది. ఏఈ ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత, పరీక్షలన్నీ రద్దయిన తర్వాత..‌ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ ఫోన్లు, […]

  • Written By: Bhaskar
  • Published On:
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ : అంతా జరిగాకా… ఇప్పుడు నిషేధమట
TSPSC

TSPSC

TSPSC: జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోవాల్సిన పరువు పోయింది. 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు నిలువునా కూలిపోయాయి. ఏళ్లకు ఏళ్ళు ప్రిపేర్ అయిన వారి కలలు కళ్ళలు అయిపోయాయి. ఇంక జరిగిన తర్వాత ఎప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేల్కొన్నది. ఏఈ ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత, పరీక్షలన్నీ రద్దయిన తర్వాత..‌ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు తీసుకురాకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది. అలాగే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.. ఆన్ లైన్ లోనే సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థను తయారుచేయనుంది. అన్నీ పరీక్షలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించాలని యోచిస్తోంది.

ఇంటి దొంగల మాటేమిటి?

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెబుతున్న బోర్డు.. ఇంటి దొంగల విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో మరి.. కమిషన్ లో ఇంటి దొంగలు పాతుకుపోయి.. ఇస్టానుసారంగా వ్యవహరించారు. ఏకంగా పాతికమంది అవుట్ సోర్సింగ్, శాశ్వత సిబ్బంది కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాశారు. వారిలో పదిమంది క్వాలిఫై అయ్యారు. మార్కులు సాధించారు.. అసలు కమిషన్ లో పనిచేసే ఉద్యోగులు ఎంత మంది పరీక్షలు రాశారు? వారిలో ఎంతమంది నిరభ్యంతర పత్రం తీసుకున్నారు? అనేదానిపై కమిషన్ ఇప్పటివరకూ మెదపడం లేదు. వాస్తవానికి అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గోల్కొండ చౌరస్తాలో పేరుమోసిన మూడు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొన్న లో 25 మంది మాత్రమే గ్రూప్ వన్ మెయిన్స్ కు అర్హత సాధించారు.. ఏమాత్రం సన్నద్ధం కాకుండానే పరీక్షలు రాసిన కమిషన్ ఉద్యోగులు 10 మంది మెయిన్స్ కు అర్హత సాధించడం, వారికి ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కులు రావడం విశేషం.

వాస్తవానికి కమిషన్ లో 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 83 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు. కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో వీరందరిలో వయసు, రిజర్వేషన్ రీత్యా అర్హులు 50 మందికి మించరు. వారిలో గ్రూప్_1 కు దరఖాస్తు చేసుకున్నవారు పాతిక మంది దాకా ఉంటారు. ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో ప్రవీణ్ సహా 10 మందికి లీకేజీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్, వెంకటేష్, వెంకటేశ్వరరావు, షమీం, మరో ఐదుగురు ఉద్యోగులకు ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కులు వచ్చాయి. ఏ కోచింగ్ సెంటర్లోనైనా, రేయింబవళ్ళు కష్టపడి చదివే బృందాల్లోనైనా పాతిక శాతానికి మించి మెయిన్స్ కి అర్హత సాధించిన చరిత్ర లేదని విషయ నిపుణులు/ ఫ్యాకల్టీలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. అలాంటిది కమిషన్ లో పాతికమందిలోపు పరీక్ష హాజరైతే వారిలో పదిమంది క్వాలిఫై అవడం ఇక్కడ అనుమానించాల్సిన విషయం.

TSPSC

TSPSC

ప్రిలిమ్స్ పేపర్లో 75% అనలెటిక్, 25% ఫ్యాక్చువల్ ప్రశ్నలతో యుపిపిఎస్సి ని మించి కఠినంగా వచ్చిన ప్రశ్న పత్రాన్ని వీరంతా ఎలా క్రాక్ చేయగలిగారు, అది కూడా 100కు పైగా మార్కులు ఎలా వచ్చాయనేది అంతుపట్టకుండా ఉంది. ప్రిలిమ్స్ లో 80-90 మార్కులు రావడం గగనం. అది కూడా మూడు నుంచి ఐదు సంవత్సరాలు కష్టపడితే తప్ప వచ్చే అవకాశం లేదు. కానీ కమిషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే ఉద్యోగికి 120 మార్కులు ఎలా వచ్చాయి? మిగతా ఉద్యోగులకు వందకు పైగా మార్కులు రావడం భారీ కుట్రగానే కనిపిస్తోంది.

ఇక పేపర్ లీక్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. వాటిని సక్రమంగా అమలు చేయగలదా? అందులో రాజకీయం జోక్యం లేకుండా నిలువరించగలదా? అసలు పూర్తిస్థాయిలో సిబ్బంది లేని బోర్డు.. పకడ్బందీగా ఎలా వ్యవహరించగలదు? ఇన్ని మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది బోర్డే?!

Tags

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు