Ketika Sharma: పర్ఫెక్ట్ గ్లామర్ ఉన్న బ్యూటీలను పట్టుకోవడంలో దర్శకుడు పూరి జగన్నాధ్ కి గొప్ప టాలెంట్ ఉంది. పైగా వాళ్ళను వెండితెరపై అందాల బొమ్మలుగా క్రేజీ హీరోయిన్లుగా మలచడంలో పూరికి ఉన్న టాలెంట్ మరొకరు లేదు. ఈ క్రమంలోనే తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మరో కొత్త బ్యూటీ కేతిక శర్మ. పాపది మోడలింగ్ రంగం. సినిమాల్లో నటించాలి, గొప్ప హీరోయిన్ అయిపోవాలని ఎంతోమందిని కలిసింది. కానీ ఆమెలోని టాలెంట్ ను ఏ దర్శకుడు గుర్తించలేకపోయాడు.
పూరి మాత్రమే ఆమెను గుర్తించి అవకాశం ఇచ్చాడు. దాంతో తెలుగు సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. మరి ‘రొమాంటిక్’ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ క్రేజ్ ను ఇస్తోందో చూడాలి. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల అవుతోంది. ఎంతైనా తొలి చిత్రం విడుదల కాబట్టి.. కేతిక శర్మకు నిద్ర కూడా పట్టడం లేదట. అసలు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో ? అని భయం పట్టుకుందట.
తాజాగా కేతిక శర్మ మీడియాతో ముచ్చటించింది. ఆ ముచ్చట్లులో భాగంగా అనేక సంగతులు చెప్పుకొచ్చింది. మరి ఆ సంగతులేమిటో ఆమె మాటల్లోనే ‘మాది డీల్లీ. నేను చిన్నప్పటి నుంచీ అక్కడే పెరిగాను. మా కుటుంబంలో అందరూ డాక్టర్లే. నేను కూడా చిన్న తనంలో డాక్టర్ కావాలనుకున్నాను. అయితే, డాక్టర్ కాకుండా యాక్టర్ అయ్యాను. ఇక నాకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది అంటే.. నా ఇన్ స్టాగ్రామ్ లో నా ఫోటోలు చూసి పూరి సర్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చారు’ అని చెప్పుకొచ్చింది కేతిక.
ఇక ‘రొమాంటిక్’ సినిమాలో తన పాత్ర గురించి కేతిక మాట్లాడుతూ ‘మోనిక అనే పాత్రలో నటించాను. అంటే ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయిగా కనిపిస్తాను. సినిమాలో నా పాత్ర చాలా భిన్నమైనది. ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. లేదంటే.. సీరియస్ గా ఉంటుంది. ఇక నా ఫస్ట్ మూవీ పూరి సర్ బ్యానర్ లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సగర్వంగా చెప్పింది.
Also Read: Balakrishna: చిత్తశుద్ధి – లక్ష్యసిద్ధి మధ్యలో బాలయ్య ‘సంకల్పశుద్ధి’ !
అన్నట్లు కేతికలో మంచి సింగర్ కూడా ఉంది. అందుకే ఈ సినిమాలో ఆమె ఒక పాట కూడా పాడింది లేండి. ఆ పాట గురించి చెప్పమంటే..కేతిక సిగ్గు పడుతూ.. ‘నా వల్లే కాదే అనే పాటను పాడాను. నాకు పాడటం రాదు. అయినా పాడాను’ అని నవ్వుతూ అంది. ఇక హీరో ఆకాష్ తో తనకు మంచి స్నేహం కుదిరిందని.. పనిలో పనిగా ఆకాష్ ను పొగుడుతూ.. ఆకాష్ చాలా మంచి వాడు అని’ ఇలా ఏదేదో చెప్పుకొచ్చింది. పాప పొగడ్తలను బాగా అలవాటు చేసుకుంది కాబట్టి.. కెరీర్ లో సక్సెస్ అవుతుంది.
Also Read: Romantic: ‘రొమాంటిక్’ లో రామ్ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి !