Pranav Shahana Love Story: ఇదికదా ప్రేమంటే.. ఫేస్‌బుక్ వీడియోలు చూసి ప్రేమించింది.. వైకల్యం ఉందని తెలిసి చివరకు అలా..!
షహానా ప్రపోజల్‌కి ప్రణవ్ ఒప్పుకోలేదు. నా లాంటి వాణ్ని చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు. ఇంకెవరినైనా చేసుకో హాయిగా ఉండు అన్నాడు. ప్రణవ్ మాటకి షహానా ఒప్పుకోలేదు.

Pranav Shahana Love Story: ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది . ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అతన్నే చేసుకుంటానని పట్టుపట్టింది. చివరికి తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఏముంది విశేషం . ఇవాళ రేపు ఇలాంటి పెళ్లిల్లు చాలనే జరుగుతున్నాయి కదా . కానీ ఈ పెళ్లికి ఒక విశేషం ఉంది. ఎందుకంటే వారిది మామూలు పెళ్లి కాదు మరి. ఆ అమ్మాయి ప్రేమలో ఒక నిజాయితి ఉంది. వారిపెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి దేశంమొత్తం చేత శెభాష్ అనిపించుకుంటుంది. ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకోబోయే వాడు దివ్యాంగుడని తెలీసి ముందడుగు వేయడం మామూలు విషయం కాదు.
కేరళకు చెందిన యువకుడు..
కేరళలోని త్రిసూర్‌కి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజేఘాట్ ప్రణవ్‌ది. చదువుకునే రోజుల్లో బైక్ యాక్సిడెంట్‌కి గురై, తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అన్నింటికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది. అయినప్పటికీ నిరుత్సాహపడని ప్రణవ్ అందరు యువకుల్లానే ఉండాలని అనుకునేవాడు. అందులో భాగంగా అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తుండేవాడు. పండుగల్ని కళ్లారా చూసేవాడు. ఫ్రెండ్స్‌తోపాటు తను కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు. ప్రణవ్ ఫ్రెండ్ అతని వీడియోలు తీసి , సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. ప్రణవ్ తల్లి తన కొడుకుకి అన్నం తినిపిస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేవాళ్లు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
వీడియోస్ చూసి…
ప్రణవ్ వీడియోలు ఒకరోజు అనుకోకుండా షహానా అనే అమ్మాయి చూసింది. షహానాది తిరువనంతపురం. ఆ వీడియోస్‌లో ప్రణవ్ కాన్పిడెన్స్ షహానాకి ఎంతో నచ్చింది. తన వైకల్యానికి కుంగిపోకుండా అందరిలానే ఉండాలనే ప్రణవ్ తత్వం నచ్చింది. ఫ్లైట్ ఎక్కి నేరుగా అతని దగ్గరికి వెళ్లింది. తర్వాత సోషల్ మీడియాలో అతడితో ఇంటరాక్ట్ అయింది. కొన్ని నెలల తర్వాత ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుంది. అతనిని ఫోన్‌చేసి మాట్లాడింది. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ప్రణవ్‌కు తన ప్రేమ విషయాన్ని చెప్పిన షహానా, పెళ్లి చేసుకుందా అని అడిగింది.
నిరాకరించిన ప్రణవ్..
షహానా ప్రపోజల్‌కి ప్రణవ్ ఒప్పుకోలేదు. నా లాంటి వాణ్ని చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు. ఇంకెవరినైనా చేసుకో హాయిగా ఉండు అన్నాడు. ప్రణవ్ మాటకి షహానా ఒప్పుకోలేదు. ‘పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా లేదంటే ఇలాగే ఉండిపోతా.. నేనంటే నీకు ఇష్టమా కాదా’ అని అడిగింది. దానికి సమాధానంగా నువ్వంటే ప్రాణం, కానీ ఏదో చెప్పబోయాడు. అంతే నీ సందేహం నాకు అర్దం అయింది. మా పేరెంట్స్ ని నేను ఒప్పిస్తా అంది.
పేరెంట్స్ కాదన్నా..
కానీ షహానా పేరెంట్స్ ప్రణవ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకోదు అని మొదట కోప్పడ్డారు. తర్వాత వద్దు తల్లీ అని బతిమలాడారు. తల్లిదండ్రుల మాటకి షహానా ఒప్పుకోలేదు. నాకు లేని బాధ మీకెందుకు అని తల్లిదండ్రుల్ని ప్రశ్నించింది.పెళ్లంటూ చేస్కుంటే ప్రణవ్ నే చేస్కుంటానని తెగేసి చెప్పింది.
ప్రేమంటే భౌతిక రూపంతో పనిలేదనీ, మనసులు కలిసేదే నిజమైన ప్రేమ అని చాటిచెప్పింది. ఆమె అంతలా ఇష్టపడుతుండటంతో ఇక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షహానా నిజమైన ప్రేమను అందరూ అభినందిస్తున్నారు. న్యూ కపల్స్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
