
Keerthy Suresh
Keerthy Suresh: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. గ్లామర్ ఉన్నంతకాలం సాగిలపడే ప్రపంచం. గ్లామర్ వెంట పరుగులు తీసే ప్రపంచం. అందుకే నటన కంటే రంగుకు, అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఎక్కువుంటుంది. అంటే ఎంత ఎక్కువ విప్పి చూపిస్తే.. అంత ప్రయోజనం అన్నమాట. ఒకప్పటి సావిత్రి, సౌందర్య రోజులు కావు ఇవి. అంతటి సాయి పల్లవి కూడా ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ కు ముద్దు ఇవ్వాల్సి వచ్చింది. సెకండ్ హాఫ్ లో మోకాళ్ళు కనిపించేలాగా మిడ్డీ వేసుకోవాల్సి వచ్చింది.. మేల్ డామినేషన్ ఇండస్ట్రీ కాబట్టి నటిమణి అంటే జస్ట్ గ్లామర్ అంతే. ఇక ఇలా మడికట్టుకొని ఉంటే అవకాశాలు రావట్లేదు అనుకుందేమో.. లేక మార్కెట్ ను మరింత పెంచుకోవాలి అనుకుందేమో.. మహానటి కీర్తి సురేష్ గ్లామర్ హద్దులు చెరిపేసింది. ఇన్నాళ్ళూ పద్ధతిగా, పక్కింటి అమ్మాయిలా కనిపించిన కీర్తి ఒక్కసారిగా అందాల హద్దులు దాటేసింది.
నలుపు రంగు డ్రెస్సులో మెరిసిపోయింది. యద అందాలు కనిపించేలాగా రెచ్చిపోయింది. ఈ ఫోటో షూట్ లో దేవకన్య లాగా మెరిసిపోయింది. అంతేకాదు వాళ్ళ విభిన్న కోణాల్లో ఫోటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ ఇలా ఫోటోలు దిగడం ఈమధ్య ఎక్కువైపోయింది. పైగా తాను నటిస్తున్న సినిమాలు మొత్తం విఫలమవుతుండడంతో.. కీర్తి సురేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Keerthy Suresh
కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లు ఇన్ని అందాలు చీరకట్టులో బంధించావా, ఇంత అందాన్ని దాస్తున్న ఆ వస్త్రాలు ఎంత గొప్పవి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ నానితో కలిసి నటించిన దసరా సినిమా మార్చి 30న విడుదల కాబోతోంది. ఇంతే కాదు పలు కీలక ప్రాజెక్టులు కీర్తి సురేష్ చేతిలో ఉన్నాయి. మహానటి చిత్రం దాకా పద్ధతిగా నటించిన కీర్తి సురేష్.. సర్కార్ వారి పాటలో మాత్రం అందాల విందు అందించింది. ముఖ్యంగా సన్నజాజి పూలు తెచ్చా పాటలో అయితే రెచ్చిపోయింది. మొన్నటిదాకా కీర్తి సురేష్ ను అందరూ జూనియర్ సౌందర్య అనుకునేవారు.. కానీ పెరిగిన పోటీ వల్ల ఆమె కూడా అందాల ప్రదర్శన చేయాల్సి వస్తోంది.. పాపమ్ మహానటి..
View this post on Instagram