Keerthy Suresh: నటిగా కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. దాదాపు అరడజను సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరో నానికి జంటగా దసరా చిత్రం చేస్తున్నారు. దసరా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతుంది. నానితో పాటు కీర్తి సురేష్ డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా దసరా విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Keerthy Suresh
వాల్తేరు వీరయ్య చిత్రంతో చిరంజీవి బ్లాక్ బస్టర్ నమోదు చేశారు. దీంతో భోళా శంకర్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ సిస్టర్ రోల్స్ చేయరు. కీర్తి ప్రత్యేకత చాటుకున్నారు. ఆల్రెడీ రజినీకాంత్ హీరోగా విడుదలైన పెద్దన్న మూవీలో కీర్తి సిస్టర్ గా నటించి మెప్పించారు. తాజాగా ఆమె రివాల్వర్ రాణి టైటిల్ తో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రకటించారు.
మహానటి చిత్రం కీర్తి ఇమేజ్ మార్చేసింది. సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో కీర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. మహానటి చిత్రంలో నటనకు గానూ కీర్తి జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా కీర్తి ఫుల్ బిజీగా ఉండగా ఎఫైర్ రూమర్స్ వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి కీర్తి దగ్గరయ్యారంటూ వార్తలు వచ్చాయి. అనిరుధ్ తో కీర్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈ పుకార్లు లేచాయి.

Keerthy Suresh
అనూహ్యంగా హీరో విజయ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారంటూ ఇటీవల కోలీవుడ్ మీడియా కోడై కూసింది. విజయ్ సంసారంలో చిచ్చు పెట్టిన కీర్తి విడాకులకు కారణమయ్యారంటూ సంచలన కథనాలు వెలువడ్డాయి. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కీర్తి 13 ఏళ్లుగా తన చైల్డ్ హుడ్ క్లాస్ మేట్ ని ప్రేమిస్తున్నారట. త్వరలో వివాహం చేసుకోబోతున్నారట. కేరళకు చెందిన ఆ యువకుడికి రిసార్ట్ బిజినెస్ ఉందట. ఈ వార్తల్లో వాస్తవం ఏమిటో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తున్నాయి.