Inaya Sultana vs Keerthy: ప్రతి సీజన్ కి ఎంతో కీలకమైన ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు ఆడే సమయం ఈ సీజన్ కి కూడా వచ్చేసింది..గత రెండు రోజుల నుండి బిగ్ బాస్ హౌస్ లో ఈ టాస్కు చాలా రసవత్తరంగా సాగుతుంది..వివిధ లెవెల్స్ తో చూసే ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఈ ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కులను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ టీం..అయితే బిగ్ బాస్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరూ ఊహించలేరు..ఈరోజు కూడా సరిగ్గా అదే జరిగింద

Inaya Sultana vs Keerthy
టికెట్ 2 ఫినాలే టాస్కు నుండి వివిధ లెవెల్స్ లో శ్రీ సత్య మరియు ఇనాయ తొలిగిపోగా చివరికి ఆరు మంది కంటెస్టెంట్స్ మిగులుతారు..ఈ ఆరు మంది కంటెస్టెంట్స్ ఏకాభిప్రాయం తో ఇద్దరినీ టాస్కు నుండి తొలగించాలని బిగ్ బాస్ చెప్తాడు..అప్పుడు కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు..ఎంత సమయం ఇచ్చిన ఎటు తేల్చకపోతేసరికి శ్రీ సత్య మరియు ఇనాయ కి ఇద్దరు కంటెస్టెంట్స్ ని తొలగించే ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్.
అప్పుడు వీళ్లిద్దరు కాసేపు చర్చించుకొని కీర్తి మరియు రోహిత్ ని గేమ్ నుండి తొలగిస్తున్నట్టు బిగ్ బాస్ కి చెప్తాడు..అప్పుడు కీర్తి వెటకారంగా చప్పట్లు కొడుతూ ‘శబాష్..సూపర్ డెసిషన్’ అని అంటుంది..అప్పుడు ఇనాయ కీర్తి దగ్గరకెళ్ళి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది..ఇది గేమ్ లో భాగం మాత్రమే..పర్సనల్ గా తీసుకోకు అంటూ కీర్తి కి చెప్తుంది..అప్పుడు కీర్తి ‘ఇప్పుడు నేను మిమల్ని ఏమి అనలేదు కదా..సూపర్ డెసిషన్ అని చెప్పాను అంతే’ అని అంటుంది కీర్తి..ఇదిగో ఇదే వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటుంది ఇనాయ.

Inaya Sultana vs Keerthy
అప్పుడు కీర్తి ‘ఓహో..అలా అనిపిస్తుందా..అయితే అలాగే అనుకో.. నేను వెటకారం గానే అన్నాను’ అంటుంది కీర్తి..అలా వీళ్లిద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవకి దారి తీసింది..ఇక ఆ తర్వాత బిగ్ బాస్ పాయింట్స్ పట్టిక ని టీవీ లో వేస్తాడు..దీనిని బట్టి కీర్తి గేమ్ లోనే ఉంది కానీ..ఇప్పుడు జరిగే టాస్కులో మాత్రం ఉండదని చెప్తుంది శ్రీ సత్య..అప్పుడు కీర్తి కూల్ అవుతుంది.