Bigg Boss 6 Telugu- keerthi: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు జరుగుతున్న సంగతి తెలిసిందే..ఈ టాస్కు వివిధ లెవెల్స్ ని దాటి ఇప్పుడు ‘రోల్ బేబీ రోల్’ అనే లెవెల్ కి చేరుకుంది..ఈ లెవెల్ లో బిగ్ బాస్ ఇచ్చిన ప్లాస్టిక్ ఇటుకలను తీసుకొని దొర్లుకుంటూ ఒక ఇటుక పై ఒక ఇటుక పేరుస్తూ టవర్ లాగా కట్టాలి..ఈ టాస్కుకి శ్రీ సత్య మరియు ఇనాయ సంచాలకులుగా వ్యవహరించారు..అయితే ఈ టాస్కులో కీర్తి చాలా తేడాగా ప్రవర్తించింది.

Bigg Boss 6 Telugu- keerthi
టవర్ కట్టిన తర్వాత శ్రీ సత్య ఒక ఇటుక తీసేయమని కీర్తికి చెప్తుంది..ఎందుకంటే శ్రీహాన్ టవర్ బాగా హైట్ ఉంది..నీది మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి అంటుంది శ్రీ సత్య..అలా సంచాలక్స్ తో గొడవ పడుతూ ఉన్న కీర్తి చాలా పొగరుగా తన టవర్ ని కాళ్లతో తన్ని పడేస్తుంది..మీకు ఇష్టమొచ్చినోళ్ళకి ఇచ్చుకోండి అంటూ కీర్తి సంచాలక్స్ తో చాలా పొగరుగా ప్రవర్తిస్తుంది.
దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..నిన్న కూడా కీర్తి ఇలాగె ప్రవర్తించింది..బిగ్ బాస్ శ్రీ సత్య మరియు ఇనాయ కి పోటీ చేస్తున్న ఆరు మంది కంటెస్టెంట్స్ లో ఇద్దరినీ తొలగించమని చెప్పగా వీళ్లిద్దరు కలిసి రోహిత్ మరియు కీర్తి ని తొలగిస్తారు..రోహిత్ వాళ్లిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ పక్కకి తప్పుకోగా, కీర్తి మాత్రం సూపర్ డెసిషన్ అంటూ వెటకారంగా మాట్లాడి ఇనాయ మరియు శ్రీ సత్య తో గొడవ పెట్టుకుంటుంది.

Bigg Boss 6 Telugu- keerthi
ఇనాయ మరియు కీర్తి మొదటి నుండి మంచి స్నేహితులుగా కొనసాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే..కానీ ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య చిచ్చు రగిలింది..ఇక ఈరోజు ఆమె ప్రవర్తించిన విధానం మాత్రం చాలా తప్పు అనే చెప్పాలి..బిగ్ బాస్ ప్రాపర్టీ ని అలా కాళ్లతో కొట్టే అధికారం కీర్తి కి ఏమాత్రం లేదు..ఇక ఈ వీకెండ్ నాగార్జున దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.