
Keeravani Father
Keeravani Father: కోట్లాది మంది భారతీయులు మన #RRR చిత్రానికి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ఎంతగానో గర్విస్తున్నారు.ఇది ఇండియన్ సినిమాకి దక్కిన గౌరవం గా భావించి ప్రతీ ఒక్కరు ప్రాంతం , బాషా అనే తేడాలు లేకుండా #RRR చిత్రాన్ని తమ సినిమాగా స్వీకరించారు.
మన తెలుగు సినిమాకి ఇలాంటి అరుదైన గౌరవం దక్కినందుకు మనకి ఎంత గర్వంగా ఉంటుందో, ఆ చిత్ర బృందానికి అంతకు మించి వంద రెట్లు ఎక్కువ గర్వంగా ఉంటుంది.కానీ ఈ పాట కి నేడు ఈ స్థాయి గుర్తింపు దక్కడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ – ఎన్టీఆర్ – ప్రేమ్ రక్షిత్ మాస్టర్.ఇవన్నీ సాధ్యపడడానికి కారణమైన రాజమౌళి విజన్ కూడా ప్రధాన కారణం.అయితే వీళ్ళెవ్వరికి అవార్డు దక్కకుండా కేవలం కీరవాణి , చంద్రబోస్ లకు అవార్డు దక్కడంపై పలువురు అభ్యంతరం వ్యక్త పరిచారు.

Keeravani Father
వారిలో కీరవాణి సొంత తండ్రి శివ శక్తి దత్త కూడా ఒకడు.రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది,ఆయన మాట్లాడుతూ ‘కీరవాణి ఎంతో గొప్ప ప్రతిభ గలవాడు, వాడి చిన్నతనం నుండే సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించి సంగీతం నేర్పించాను.నేడు ఇండస్ట్రీ లో ఎన్నో వందల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసి ఎన్నో అద్భుతమైన పాటలను స్వరపర్చాడు.వాడికి నేడు ఆస్కార్ అవార్డు రావడం చాలా గర్వం గా ఉంది.కానీ నాకు ‘నాటు నాటు’ పాట పెద్దగా నచ్చలేదు.కీరవాణి ఎన్నో అద్భుతమైన పాటలకు మ్యూజిక్ సమకూర్చాడు.వాటితో పోలిస్తే నాటు నాటు ఎంత..? అలాగే చంద్రబోస్ గారు ఇది వరకు 5 వేల పాటలు వ్రాసారు.వాటితో పోలిస్తే నాటు నాటు పాట ఎంత చెప్పండి.ఇది కేవలం కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మరియు హీరోల క్రెడిట్ మాత్రమే, వారి వల్లే నా కొడుక్కి ఆస్కార్ అవార్డు దక్కింది’ అంటూ శివ శక్తి దత్త ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.