Vastu Tips: ఈ విగ్రహాలు ఇంట్లో ఉంచుకుంటే సకల శుభాలే తెలుసా?
ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచుకుంటే చాలా మంచిది. తాబేలు బొమ్మ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ఇష్టంగా తాబేలు ఉంటుంది. అందుకే ఉత్తర దిశలో తాబేలును ఉంచుకుంటే సంపద కలిసి వస్తుంది. ఇలా తాబేలు బొమ్మ ఉంచుకోవడం వల్ల వాస్తు ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Vastu Tips: మన ఇంటికి పక్కా వాస్తు ఉండాలని కోరుకుంటాం. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని కాంక్షిస్తారు. ఇంట్లో ఏ జంతువుల బొమ్మలు ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుందో వాస్తు ప్రకారం సూచనలు చేస్తుంది. మనకు మంచి లాభాలు కలిగించే వాటిని ఉంచుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
ఏనుగుల జత
జంట ఏనుగుల బొమ్మ ఇంటిలో ఉంటే వాస్తు ప్రకారం ఎంతో మంచిదిగా చెబుతున్నారు. ఏనుగుల బొమ్మ ఉంచుకుంటే కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. వెండి లేదా ఇత్తడి ఏనుగుల బొమ్మ ఉంచుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇలా ఏనుగుల బొమ్మ ఉంచుకోవడం వాస్తుపరంగా చాలా సురక్షితమని చెబుతున్నారు.
తాబేలు
ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచుకుంటే చాలా మంచిది. తాబేలు బొమ్మ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ఇష్టంగా తాబేలు ఉంటుంది. అందుకే ఉత్తర దిశలో తాబేలును ఉంచుకుంటే సంపద కలిసి వస్తుంది. ఇలా తాబేలు బొమ్మ ఉంచుకోవడం వల్ల వాస్తు ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
చేపలు
ఇంట్లో చేపల బొమ్మ ఉంచుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్రంలో చేపలను సంపదకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈశాన్యం లేదా తూర్పు దిశలో చేపల విగ్రహాలు ఉంచుకుంటే శుభప్రదం. చేపల బొమ్మలు ఉంచుకుంటే మన ఇంటికి శుభమే కలుగుతుంది. ఇలా వాస్తు ప్రకారం ఇంటికి దోషాలు ఉన్నా దూరమవుతాయి. అందుకే చేపల బొమ్మలు ఉంచుకోండి.
ఆవు
మనం ఆవును గోమాతగా పూజిస్తాం. సకల దేవతలకు ప్రతిరూపంగా దీన్ని భావిస్తారు. ఆవు విగ్రహాన్ని కూడా మన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంతటి మహత్తర శక్తి గల ఆవు బొమ్మను ఇంట్లో ఉంచుకుని మంచి లాభాలు కలిగేందుకు ఆస్కారం ఉండే ఈ ప్రయత్నం చేయడం చాలా మంచిది.