Keeda Cola Review: కీడా కోలా మూవీ ఫుల్ రివ్యూ…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా నటుడి గా కూడా చాలా వరకు అలరించాడనే చెప్పాలి.ఇక తనదైన రీతిలో సినిమా ఎక్కడ కూడా కొంచెం కూడా డివీయేట్ అనేది అవ్వకుండా 100% ఎఫర్ట్ పెట్టీ నటించాడు.

  • Written By: Gopi
  • Published On:
Keeda Cola Review: కీడా కోలా మూవీ ఫుల్ రివ్యూ…

Keeda Cola Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకి సపరేట్ స్టైల్ అనేది ఉంటుంది అందులో భాగంగానే పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ మేకింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్…ఈయన ఆ తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యూత్ కి ఫేవరెట్ డైరెక్టర్ గా మారి పోయాడు.ఇక ఇదే క్రమంలో కీడాకోలా అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరించింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక ముందు గా ఈ సినిమా స్టోరీ లోకి వెళితే ఒక కూల్ డ్రింక్ బాటిల్లో ఒక బొద్దింక వస్తే దాన్ని క్యాష్ చేసుకొని ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవాలని ఉద్దేశ్యం తో ఒక వ్యక్తి ఆ కంపెనీ మీద కేసు వేస్తాడు ఇక ఇదే క్రమంలో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. అయితే చివరికి కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అందులో ఉన్న ట్విస్ట్ లు ఏంటి అనేది తెలియాలంటే మీరు కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే…

ఇక ఒకసారి సినిమాకు సంబంధించిన విషయాలను బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

ముందుగా ఈ సినిమా స్టోరీ ని తరుణ్ భాస్కర్ చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. ఒక కూల్ డ్రింక్ ద్వారా సినిమా మొత్తాన్ని ముందుకు నడిపిస్తూ ఆ ప్లాట్ ని చాలా బాగా ఎస్టాబ్లీష్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.ఇక ఇదే క్రమంలో తనదైన రీతిలో స్క్రీన్ ప్లే ని అద్భుతంగా నడిపిస్తూ ఒక సపరేట్ ట్రాక్ లోకి తీసుకెళ్లడానే చెప్పాలి. ఎందుకంటే తరుణ్ భాస్కర్ ఇంతకుముందు చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి ఇక అదే తరహా లో సినిమాలు చేయకుండా ఒక కొత్త జానర్ లో సస్పెన్స్ కామెడీని మిక్స్ చేసి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. క్యారెక్టర్ కూడా ఒక పర్పస్ ప్రకారమే సినిమాలో ఉండడం జరుగుతుంది అంతే తప్ప ఈ సినిమా లో వచ్చిపోయే క్యారెక్టర్ అనేది ఏదీ లేదు ప్రతీ క్యారెక్టర్ కి ఏదో ఒక ఇంటర్ లింక్ అనేది ఉంటుంది దాని వల్లే చాలావరకు తరుణ్ భాస్కర్ ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే తరుణ్ భాస్కర్ కి సపరేట్ స్టైల్ అనేది ఉంటుంది ఆ స్టైల్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా ఈజ్ గా సినిమాలను చేస్తూ నటుల దగ్గర నుంచి నటనని రాబట్టుకుంటూ ప్రేక్షకులను ఆ నటులతో ఎంగేజ్ చేసే విధంగా సినిమాని తీర్చిదిద్దాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా స్క్రీన్ మీద మనల్ని మనకు చూపిస్తూ ఉంటాయి. మొదట సినిమాని ఎత్తుకున్న ప్లాట్ అనేది బాగుంది ఎక్కడ అసలు తగ్గకుండా చాలా బాగా తీశాడు…ఇక సెకండ్ హాఫ్ మిడిల్ కి వచ్చేసరికి మాత్రం కొన్ని సీన్లని హ్యాండిల్ చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఇబ్బంది పడుతుంటారు కానీ అలాంటి సీన్లని కూడా ఈ సినిమాలో చాలా జాగ్రత్తగా చేస్తూ తరుణ్ భాస్కర్ తనదైన రీతిలో సినిమాని అసలు ఎక్కడ కూడా నార్మల్ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ప్రతి సిచువేషన్ లో ఒక కామెడీ సెటప్ ని వాడుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా నటుడి గా కూడా చాలా వరకు అలరించాడనే చెప్పాలి.ఇక తనదైన రీతిలో సినిమా ఎక్కడ కూడా కొంచెం కూడా డివీయేట్ అనేది అవ్వకుండా 100% ఎఫర్ట్ పెట్టీ నటించాడు. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన క్యారెక్టర్ కూడా చాలా బాగా ఉంది.రఘు పోషించిన క్యారెక్టర్ అయితే క్లియర్ గా చాలా బాగా పండిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ అద్భుతమైన థీమ్ సాంగ్ అయితే ఇచ్చాడు దాంతో పాటుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే అనేలా ఉంది.ఇక ఏజే అరోణ్ సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి…

ఇక ఈ సినిమా అంత పర్ఫెక్ట్ గా కుదరడానికి అన్ని డిపార్ట్మెంట్ లు కూడా చాలా బాగా హెల్ప్ చేశాయనే చెప్పాలి…ఎందుకంటే ప్రతి సిచువేషన్ లో కూడా ఒక మూడు ని సెట్ చేయడంలో డైరెక్టర్ ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాడు దానికి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాటోగ్రాఫర్ మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఒకేసారి కలిసి హైలైట్ అవ్వడం వల్ల ఈ సినిమా అనేది బ్లాస్ట్ అయిందనే చెప్పాలి…

ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ అనే చెప్పాలి అలాగే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ కూడా చాలా బాగా ప్లస్ అయింది.ఇక అలాగే ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ యాక్టింగ్ అయితే ఈ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా హెల్ప్ అయింది…

ఈ సినిమాకు నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి
కొన్ని సీన్లు అక్కడక్కడ లాగ్ అయ్యాయి అలాగే కొన్ని క్యారెక్టర్స్ ని ఎంతవరకైతే వాడుకోవాలో అంత వరకు వాడుకున్నాడు. కానీ ఒకటి రెండు చిన్న క్యారెక్టర్లు ఉన్నాయి వాటిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడితే ఇంకా బాగుండేది అలాగే మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చినప్పటికీ మాత్రం ఎలివేట్ అవ్వకపోవడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది మైనస్ అవ్వడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు…

వీటిని మినహాయిస్తే ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు అని చెప్పొచ్చు…ఫ్యామిలీ మొత్తం ఈ వీకెండ్ లో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చు…

ఇక సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు