Kedar Jadhav : కామెంట్రీ చెబుతుంటే పట్టుకొచ్చి ఆర్సీబీ తరుఫున ఆడిస్తున్నారు

కాలి గాయంతో బాధపడుతున్న డేవిడ్ విలీ స్థానంలో కేదార్ జాదవ్ ను ఐపీఎల్ 2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB)కి తిరిగి తీసుకుంది. 2016 , 2017లో ఆర్సీబీ తరపున ఆడిన జాదవ్ మళ్లీ జెర్సీని ధరించి తన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆసక్తిగా ఉన్నాడు.

  • Written By: NARESH
  • Published On:
Kedar Jadhav : కామెంట్రీ చెబుతుంటే పట్టుకొచ్చి ఆర్సీబీ తరుఫున ఆడిస్తున్నారు

Kedar Jadhav : అప్పట్లో ఇక తన పని అయిపోయిందని కామెంటరీ చెబుతున్న దినేష్ కార్తీక్ ను ఏకంటీ టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసి ఆడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఐపీఎల్ సీజన్ లో దినేష్ ధాటిగా ఆడడంతో అతడిని ఎంపిక చేశారు. కానీ ఐపీఎల్ అయిపోయాక ఆయన క్రికెట్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా చెబుతుంటే ఇలా పిలిచి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అలాగే ఐపీఎల్ లో మరాఠి వ్యాఖ్యానం చేస్తున్న కేదార్ జాదవ్ కు ఇలానే పిలుపు వచ్చిందట..

కాలి గాయంతో బాధపడుతున్న డేవిడ్ విలీ స్థానంలో కేదార్ జాదవ్ ను ఐపీఎల్ 2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB)కి తిరిగి తీసుకుంది. 2016 , 2017లో ఆర్సీబీ తరపున ఆడిన జాదవ్ మళ్లీ జెర్సీని ధరించి తన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆసక్తిగా ఉన్నాడు.

17 మ్యాచ్‌లలో 23.92 సగటుతో 311 పరుగులు 142.66 స్ట్రైక్ రేట్‌తో, అతను గత ఐపీఎల్ లో సత్తాచాటాడు. ప్రభావం చూపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆర్సీబీ ప్రధాన కోచ్ సంజయ్ బంగర్ నుండి తనకు ఎలా కాల్ వచ్చిందో జాదవ్ ఇటీవల పంచుకున్నాడు. మరోసారి జట్టు కోసం ఆడేందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.

కేదార్ జాదవ్ మాట్లాడుతూ.. “నేను ఈ ఐపీఎల్ లో మరాఠీలో వ్యాఖ్యానం చేస్తున్నాను. ఆర్సీబీ కోచ్ బంగర్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అని అడిగాడు. నేను మరాఠీలో ఐపీఎల్ వ్యాఖ్యానిస్తున్నానని చెప్పాను. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావా అని అతను ఆరా తీశాడు.. వారానికి రెండుసార్లు అని నేను బదులిచ్చాను. జిమ్‌లో రెగ్యులర్‌గా ఉన్నానని నా హోటల్‌లో కూడా ఫిట్ నెస్ కోసం కసరత్తు చేస్తున్నట్టు చెప్పాను. క్రికెట్ ఆడడానికి సిద్ధమేనని చెప్పాను. నన్ను తిరిగి ఐపీఎల్ జట్టులోకి రావాలని కోరాడు. ఆర్సీబీ కోసం ఆడమని అడుగుతాడని అనుకున్నాను.. తర్వాత కాల్ చేసి రమ్మన్నాడు.” అని కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు.

ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో కేదార్ అదరగొట్టాడు. ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న IPL సీజన్‌లో కూడా ఆర్సీబీ తరుఫున ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశిస్తున్నాడు.

కేదార్ జాదవ్ మాట్లాడుతూ “నేను ఒక సంవత్సరం విరామం తీసుకున్నాను, క్రికెట్ అభిరుచిని కోల్పోతున్నానని గ్రహించాను అందుకే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ ఆడాడు. అన్ని స్థాయిలలో మళ్లీ ఆడగలనని భావించాను. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉన్నాను” అంటూ పేర్కొన్నారు.

ఐపీఎల్ 2023లో ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ని శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. మరో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో ఉంది.కేదార్ ఇప్పటికే జట్టులో చేరాడు.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు