KCR- National Party: కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పట్లో లేనట్లే.. మారిన ముహూర్తం
KCR- National Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా దానికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో మంతనాలు జరిపారు. పలువురు నేతలను కలిసి తన ఉద్దేశాలను వివరించారు. దీంతో దసరా పండగ రోజే కొత్త పార్టీని ప్రకటించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని డిసెంబర్ కు వాయిదా వేసుకున్నారు. దీంతో దీనికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నారు. జెండా, […]

KCR- National Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా దానికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో మంతనాలు జరిపారు. పలువురు నేతలను కలిసి తన ఉద్దేశాలను వివరించారు. దీంతో దసరా పండగ రోజే కొత్త పార్టీని ప్రకటించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని డిసెంబర్ కు వాయిదా వేసుకున్నారు. దీంతో దీనికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నారు.

KCR- National Party
జెండా, ఎజెండా, విధి విధానాలపై రూపకల్పనపై పలువురు నిష్ణాతులైన వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి ఇంకా సమయం కావాల్సి ఉంది. అందుకే కేసీఆర్ పార్టీ ప్రకటనపై మరో రెండు సమయం తీసుకునే అవకాశాలున్నాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కానీ ఇంకా తుది రూపు రానందున జాతీయ పార్టీకి సంబంధిన పనులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభించలేదు. టీఆర్ఎస్ పార్టీని కూడా జాతీయ పార్టీలో విలీనం చేసే అంశం కూడా ఉండటంతో పార్టీ ప్రకటన వాయిదా వేసుకుంటున్నారు.
దేశ రాజకీయాల్లో తనదైన సత్తా చాటాలని కేసీఆర్ చూస్తున్నారు. దీనికి గాను రైతు సమస్యలను ఎజెండాగా తీసుకోనున్నారు. రైతుబంధు, ఇరవైనాలుగు గంటల కరెండ్, దళితబంధు తదితర పథకాలతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు యూపీలో దళితులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. మహారాష్ట్రలో రైతులతో సభ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ ప్రకటన డిసెంబర్ లో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

KCR- National Party
మూడో కూటమి కోసం కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పర్యటించి పార్టీల్లో ఐక్యత తీసుకురావాలని భావిస్తున్నారు. దీని కోసం నిరంతరం వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని తదనుగుణంగా పార్టీ ప్రకటన ఉండాలని సూచిస్తున్నారు. దీని కోసమే నిపుణుల సలహాలు, సూచనలు లెక్కలోకి తీసుకుంటున్నారు. పార్టీ ప్రకటనతో దేశంలో సమూల మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటన, దాని ప్రభావంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
