గవర్నర్ తో కెసిఆర్ భేటీ .. రెండు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను రాజ్‌భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మంత్రి మండలి ఆమోదం పొందిన ప్రతిని గవర్నర్ కి అందజేశారు కెసిఆర్. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ […]

  • Written By: Neelambaram
  • Published On:
గవర్నర్ తో కెసిఆర్ భేటీ .. రెండు కీలక అంశాలపై చర్చ


తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను రాజ్‌భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మంత్రి మండలి ఆమోదం పొందిన ప్రతిని గవర్నర్ కి అందజేశారు కెసిఆర్. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు.

ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్‌ దృష్టికి సీఎం కేసీఆర్‌ తీసుకెళ్లారు.

ఈ నెల 6 (శుక్రవారం) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారుచేస్తారు.

సంబంధిత వార్తలు