KCR- Munugode By Election: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మునుగోడు పరిస్థితులతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఆలోచనలో పడుతోంది. బీజేపీ ఎదుగులకు టీఆర్ఎస్ నివ్వెరపోతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మునుగోడులో పార్టీ ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావిస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నక వ్యవహారం అధికార పార్టీకి గుదిబండగా మారనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు మంచిదా? మునుగోడు ఉప ఎన్నిక మంచిదా అనే వాదన పార్టీలో కొనసాగుతోంది.

KCR
కొద్ది రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మద్య మాటల యుద్ధం పెరుగుతోంది. రాష్ట్రంలో బలపడటానికి ఇరు పార్టీలు తమ వ్యూహాలు రచిస్తున్నాయి. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పడం గమనార్హం. దీంతో అధికార పార్టీలో మునుగోడు వ్యవహారం మంట పెడుతోంది. ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ముందస్తుకు వెళితే ఎలా ఉంటుందనే దానిపై కేసీఆర్ ఆలోచనలో పడినట్లు సమాచారం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ముందస్తుకు వెళితే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
Also Read: KCR- Aasara Pensions: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో శుభవార్త
ముందస్తుకు వెళ్లకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం. దీంతో ఉప ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగిస్తుండటంతో టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో మునుగోడు విషయం పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఏం చేసేదని సీఎం కేసీఆర్ దీర్ఘాలోచనలో పడిపోతున్నారు. ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు తలనొప్పులు తెస్తున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ విజయం ఖాయమే. దీంతో రాబోయే ఎన్నికలకు ఇది రెఫరెండంగా మారనుండటంతో టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో తోచడం లేదు.

KCR
మునుగోడు ఉప ఎన్నికకు వెళితే నష్టం తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు వెళితే కూడా టీఆర్ఎస్ పార్టీకి కలిసి రాదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో మునుగోడు విషయంలో బీజేపీని ఎలా నిలువరించాలని టీఆర్ఎస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై మల్లగుల్లాలు పడుతోంది. ముందస్తుకు వెళితే మొదటికే మోసం వస్తుందో ఏమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మునుగోడు వ్యవహారంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. కేసీఆర్ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
Also Read:Ayodya Ramamandir: అయోధ్య రామమందిరం ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?