KCR – G20 : కేసీఆర్ ఎందుకు మొహం చాటేస్తున్నారు?

అయితే రాష్ట్రపతి ఇచ్చే విందుకు కెసిఆర్ హాజరు కావడం లేదు. మొదట విందుకు వెళ్తారు అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్పాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ముఖ్యమంత్రి వెళ్లడం లేదని ప్రకటించాయి.

  • Written By: NARESH
  • Published On:
KCR – G20 : కేసీఆర్ ఎందుకు మొహం చాటేస్తున్నారు?

KCR – G20 : జి20 సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రపంచ దేశాధినేతలతో దేశ రాజధాని కళకళలాడుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఇలాంటి అప్పుడు ఎవరైనా సరే ఆ వేడుకలో భాగం కావాలి అనుకుంటారు. అవకాశం లభిస్తే తమ వాణి వినిపించాలి అనుకుంటారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి విభిన్నం కాబట్టి.. ఆయన ధోరణి ప్రత్యేకం కాబట్టి.. ఆయనకు జి20 సమావేశాలకు ఆహ్వానం అందినప్పటికీ దూరంగా ఉన్నారు. మొదట వస్తాను అని చెప్పి.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ ముఖ్యమంత్రి? ఏమిటి ఆయన కథ? చదివేద్దాం రండి.

జి20 సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాల ముందు భారత ఐక్యతను ప్రదర్శించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నడుం బిగించారు. సమావేశాలు ప్రారంభమయ్యే శనివారం రోజున రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు. తన ఆధ్వర్యంలో నిర్వహించే విందుకు రావాలని కోరారు. జాబితాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఉన్నారు. అయితే వీరంతా కూడా రాష్ట్రపతి ఇచ్చే విందుకు వెళ్తున్నారు. అయితే రాష్ట్రపతి ఇచ్చే విందుకు కెసిఆర్ హాజరు కావడం లేదు. మొదట విందుకు వెళ్తారు అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్పాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ముఖ్యమంత్రి వెళ్లడం లేదని ప్రకటించాయి. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హతాశులవడం రాజకీయ విశ్లేషకుల వంతు అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఈ సభలను మాత్రమే కాదు.. నీతి ఆయోగ్ వంటి సభలకు కూడా గైర్హాజరవుతున్నారు. దీనికి కేంద్రం తాము ఇస్తున్న ప్రతిపాదనలకు ఆమోదయోగ్యం తెలపకపోవడమే కారణమని చెబుతున్నారు.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వంటి వారు విందుకు వెళ్తున్నప్పుడు.. కెసిఆర్ ఎందుకు వెళ్లడం లేదనే చర్చ తెలంగాణలో జరుగుతోంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వంటి వారితో కెసిఆర్ కు టర్మ్స్ బాగానే ఉన్నాయి. ఆమధ్య ఢిల్లీకి సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేసీఆర్ మద్దతు కోరేందుకు అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చారు. కెసిఆర్ తో ప్రగతిభవంలో సుదీర్ఘ సమయం పాటు చర్చించారు. అప్పట్లో ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. వాటిని తెలంగాణలో కూడా అమలు చేయడం ప్రారంభించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆప్, మిగతాపార్టీల నాయకులు ఇండియా కూటమిలో చేరారు. అయితే ఈ కూటమిలో చేరాలని కెసిఆర్ కు ఎటువంటి ఆహ్వానం అందలేదు. ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తాము చేరేది లేదని కెసిఆర్ ప్రకటించుకున్నారు.

ఇక ఆ మధ్య ఢిల్లీలో జరిగిన భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా ఎవరినీ కేసీఆర్ పిలవలేదు. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులను మాత్రమే అక్కడికి తీసుకెళ్లి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు. చివరికి కేసీఆర్ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న మహారాష్ట్ర నుంచి కూడా కార్యకర్తలు రాకపోవడం విశేషం. అయితే జీ20 హాజరు కాకపోవడం వెనుక మరో కోణాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు విశదీకరిస్తున్నారు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీతో కేసిఆర్ వైరం సాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఆయనకు స్వాగతం పలికేందుకు నిరాకరిస్తున్నారు. కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మాత్రమే స్వాగతం పలికిస్తున్నారు. కేంద్రం నిర్వహించే ఏ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఇప్పుడు తాజాగా జి20 విందుకు కూడా కేసీఆర్ హాజరు కావడం లేదు. అంటే ఈ చీరల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తానే బలంగా ఢీకొడుతున్నట్టు కెసిఆర్ చెప్పుకుంటున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనిద్వారా దేశ రాజకీయాల్లోనూ మోడీకి ప్రత్యామ్నయం మేమే అని కెసిఆర్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. మరి అంతటి వైరం సాగించినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పేరు వెలుగులోకి వచ్చినప్పుడు కేసీఆర్ చేసిన గాయి గాయి తర్వాత ఎందుకు చల్లారిపోయింది? మునుగోడు ఎన్నికల ముందు బిజెపి మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తర్వాత ఎందుకు ఆగిపోయాయి? ఇటీవల కెసిఆర్ పాల్గొన్న సభల్లో బిజెపి మీద ఎందుకు విమర్శలు చేయలేదు? ఇవన్నీ సమాధానం లేని గొట్టు ప్రశ్నలేం కావు. కాకపోతే వీటికి సమాధానాలు ప్రజలకు తెలియవు అని కేసిఆర్ అనుకోవడమే ఇక్కడ పెద్ద పొరపాటు.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు