Modi vs KCR : మళ్లీ ఇగో వార్: తెలంగాణకు మోడీ.. ఢిల్లీకి కేసీఆర్ పలాయనం..
Modi vs KCR : తెలంగాణపై వార్ మొదలుపెట్టిన మోడీతో ఢిల్లీలోనే కాదు.. గల్లీలో కూడా తేల్చుకునే పనిలో పడ్డారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఇప్పటికే కోట్లు కుమ్మరించి మరీ మునుగోడులో బీజేపీని ఓడించినా కూడా కేసీఆర్ కోపం తగ్గలేదు. దేశానికి ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ప్రొటోకాల్ ప్రకారం అయినా పలకరించాల్సింది పోయి ‘పోవోయ్ మోడీ’ అంటూ తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఉంటే ఎక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనకుంటే బ్యాడ్ నేమ్ […]

Modi vs KCR : తెలంగాణపై వార్ మొదలుపెట్టిన మోడీతో ఢిల్లీలోనే కాదు.. గల్లీలో కూడా తేల్చుకునే పనిలో పడ్డారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఇప్పటికే కోట్లు కుమ్మరించి మరీ మునుగోడులో బీజేపీని ఓడించినా కూడా కేసీఆర్ కోపం తగ్గలేదు. దేశానికి ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ప్రొటోకాల్ ప్రకారం అయినా పలకరించాల్సింది పోయి ‘పోవోయ్ మోడీ’ అంటూ తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఉంటే ఎక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనకుంటే బ్యాడ్ నేమ్ వస్తుందని గ్రహించి ఢిల్లీ ఫైట్ ఎక్కేస్తున్నారు.
ఏపీలో పర్యటన ముగించి ఈరోజు తెలంగాణకు మోడీ రానున్నారు. ఇప్పటికే మునుగోడుతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితులున్నాయి. మోడీకి నో ఎంట్రీ అంటూ పోస్టర్లు కూడా అంటించారు. ఈ క్రమంలోనే రైతుల కోసం రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్రం ప్రారంభిస్తోంది. ఇందులో తెలంగాణకు 11 శాతం వాటా కూడా ఉంది. ఇందులో సీఎం హోదాలో కేసీఆర్ ను పాల్గొనాలని కేంద్రం కూడా ఆహ్వానించింది. కానీ కేసీఆర్ కు ఇగో అడ్డొచ్చింది. ఇన్నాళ్లు తిట్టిననోటితో మళ్లీ మోడీ పక్కన నిలబడి ముసిలి నవ్వులు నవ్వడానికి కేసీఆర్ కు అహం అడ్డొచ్చింది. అందుకే ఈ పంచాయితీ అంతా ఏందని కేసీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశాడు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను జాతికి మోడీ అంకితం చేస్తారు. 6 గంటల పాటు తెలంగాణలో మోడీ పర్యటిస్తున్నారు. ఇప్పటికే కార్మిక వ్యతిరేక విధానాలపై సింగరేణి కార్మికులు ‘గో బ్యాక్ మోడీ’ అంటూ నినదిస్తున్నారు. కమ్యూనిస్టులు ఈ పర్యటనను వ్యతిరేకించారు. కేసీఆర్ పర్యటనకు దూరంగా ఉండడంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరుఫున మోడీతోపాటు రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు మోడీ వెంట ఉన్నారు.రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం సాయంత్రం 4.15 గంటలకు ఎన్టీపీసీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మోడీ చేరుకొని సభలో ప్రసంగిస్తారు.
ఇంతటీ కీలక పర్యటన వేళ కేసీఆర్ మోడీని చూడడం.. ఆయనతో కలిసి పాల్గొనడం ఇష్టం లేక ఢిల్లీ వెళ్లిపోతున్నారు. ఢిల్లీలో ఏం షెడ్యూల్ ఉందో లేదో కానీ.. కేసీఆర్ ఇలా ప్రొటోకాల్ పాటించకుండా వెళ్లిపోవడం దుమారం రేపుతోంది. ఇగో ఇంత వైఫైలో ఉంటే మోడీ, కేసీఆర్ కలిసి ఎలా పాల్గొంటారని టీఆర్ఎస్ శ్రేణులు వెనకేసుకొస్తున్నారు.
