
Tolivelugu
Tolivelugu: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ మీడియాను మింగేస్తోంది. ప్రజల పక్షాన నిలిచే, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే మీడియాపై సామ దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తోంది. తాయిలాలు ఎవరవేస్తోంది. కాదన్నవారికి బెదిరింపులకు దిగుతోంది. అయినా మారని వారిని స్వాధీనం చేసుకుంటోంది. చివరకు సోషల్ మీడియా చానెళ‍్లను కూడా వదలడం లేదు. ఇదంతా ఎందుకు అంటే.. ఎన్నికల ఏడాది వైఫల్యాలను మెయిన్‌స్ట్రీమ్ మీడియాకంటే.. సోషల్ మీడియానే ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. దీంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మీడియా కట‍్టడిపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా వారం క్రితం వీ6, వెలుగు మీడియాను మీడియా సమావేశంలోనే బెదిరించారు. తాజాగా సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన ‘తొలివెలుగు’ చానెల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆ చానెల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేశారు.
మొదటి నుంచీ కక్ష సాధింపు..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టేవారిపై మొదటి నుంచి కక్షసాధింపు ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. నచ్చని వారిని తొక్కేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో భాగంగా మొదట ఆంధ్రజ్యోతిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. చానెల్‌ను బ్యాన్ చేశారు. పత్రికకు యాడ్స్ నిషేధించారు. తర్వాత టెన్ టీవీ, టీవీ9ను కొనుగోలు చేశారు. నమస్తే తెలంగాణను హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ చానెళ్లలో ప్రభుత్వ అనుకూల వార్తలను ప్రసారం చేయిస్తున్నారు. అధికార పార్టీకి భజర చేయిస్తున్నారు.
మరికొన్నింటికి తాయిలాలు..
ఇక ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, ఇతర పత్రికలకు అడ‍్వర్టయిజ్ మెంట్స్ కుమర్మరిస్తున్నారు. నచ్చని పత్రికలకు యాడ్స్ ఇవ్వడం లేదు. మరోవైపు తమకు అవసరమైన వార్తలకు ఎక్కువ కవరేజీ ఇచ్చేందుకు మీడియా యాజమాన్యాలకు తాయిలాలు కూడా ఇస్తున్నారు. దీంతో మీడియా మేనేజ్‌మెంట్ పూర్తి అధికార పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఒకటి రెండు వ్యతిరేక చానెళ్లు..
గులాబీ బాస్ కేసీఆర్ ఎంత మీడియా మేనేజ్మెంట్ చేసినా ఆంధ్రజ్యోతి, వెలుగు లాంటి పత్రికలు, వీ6, ఏబీఎన్, రాజ్‌న్యూస్ లాంటి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ చానెళ్లు, క్యూ న్యూస్, తొలి వెలుగు, కాళోజీ లాంటి సోషల్ మీడియా చానెళ్లు అధికార పార్టీ అరాచకాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నాయి. మోయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకోవడంతో సోషల్ మీడియా తెలంగాణలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇటీవల ప్రధాన పత్రికలు, నూ‍్యస్ చానెళ్ల కంటే సోషల్ మీడియానే అత్యంత ప్రభావంతంగా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తున్నాయి.

Tolivelugu
ఎన్నికల వేల కక్ష సాధింపు..
మరో ఎనిమిది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగననున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మీడియాపై కక్షసాధింపు చర్యలు మళ్లీ మొదలు పెట్టారు. తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. అవసరమైతే ఆ చానెళ్లను కొనేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీవీ9 నుంచి బయటకు వచ్చిన తర్వాత రవిప్రకాశ్ వెనుకుండి నడిపిస్తున్న తొలివెలుగు మీడియాను కేటీఆర్ కబ్జా చేశాడు. ఇందుకు రవి ప్రకాశ్‌కు రూ.6 కోటు‍్ల ముట్టజెప్పిట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తొలి వెలుగు మీడియాకు హైప్ తీసుకువచ్చిన న్యూస్ రీడర్ రఘుతోపాటు, అందులో నిబద్ధతతో పనిచేసిన రిపోర్టర్లను రోడ్డు పడేశారు. అంతే కాకుండా వారిపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.
మొత్తంగా అధికార బీఆర్‌ఎస్ చర్యలు చూస్తుంటే మీడియా, సోషల్ మీడియా భయం పట్టుకున్నట్లు అనిపిస్తోంది. ఇంతటితో ఇవి ఆగిపోతాయనుకోలేం. ముందుముందు ఇలాంటివి అనేకం ఉండొచ్చని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.