KCR Kavitha : “ఈడీ వద్దు బోడీ వద్దు.. సీబీఐ వద్దు” అంటూ ఆ మధ్య కేసీఆర్ సర్కార్ తెలంగాణలోకి దర్యాప్తు సంస్థలు రావద్దు అంటూ జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. అప్పట్లో చంద్ర బాబు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. అయితే జనరల్ కన్సెంట్ రద్దు వల్ల జాతీయ దర్యాప్తు సంస్థలు రాష్ట్రం లో అడుగు పెట్టే అవకాశం ఉండదు. ఏ కేసు విషయంలోనూ సీబీఐ దర్యాప్తు చేయడం కుదరదు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తే వారే దర్యాప్తు చేసి పెడతారు.. నిందితులను ప్రశ్నించి పెడతారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కన్సెంట్ రద్దు చేయడం వల్ల కేంద్ర ఉద్యోగుల పైనా సీబీఐ అధికారులు దాడులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. వారు అంగీకరిస్తే చేయాలి.. లేదంటే లేదు. ఏదైనా అవినీతికి సంబంధించి సమాచారం ఉంటే ఏసిబి అధికారులే దాడి చేస్తారు.

KCR and Kavitha
కేసీఆర్ నో…కవిత ఎస్
ఢిల్లీ మద్యం కుంభకోణం లో చార్ష్ షీట్ దాఖలు చేసిన ఈడీ కవిత పేరు చేర్చింది. ఇక్కడి నుంచే అసలు ఆట మొదలయింది. ఏహే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కవిత గాంభీర్యం ప్రదర్శించింది. మహా అయితే జైల్లో పెడతారు. ఉరి అయితే తీయరు కదా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇది జరిగిన తెల్లారే సీబీఐ కవితకు నోటీస్ పంపింది. ఎక్కడ విచారణకు రావాలో చెబితే వస్తామని వర్తమానం పంపింది. దీనిపై గులాబీ మీడియా, టీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడారు. కానీ అసలు తత్వం బోధపడి కవిత కేసీఆర్ వద్దకు వెళ్లారు. ఆయన సూచనలతో సీబీఐ కి లేఖ రాశారు. తనను ఎందుకు విచారించాలని అనుకుంటున్నారో చెప్పాలి అనేది అందులో సారాంశం. అయితే సీబీఐ ఇచ్చే సమాధానం ఆధారంగా న్యాయ పోరాటం చేయాలనేది కవిత లక్ష్యం. ఇప్పుడు సీబీఐ ఇచ్చే సమాధానం కోసం కేసీఆర్, కవిత ఎదురు చూస్తున్నారు.
కవిత మర్చిపోయారా
ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థల సిబ్బందిపై ఏసీబీ దాడులు చేస్తారన్న ప్రచారం జరిగింది.. కవిత జనరల్ కన్సెంట్ రద్దు నిర్ణయాన్ని మర్చిపోయి తెలంగాణలో సిబిఐ ప్రవేశానికి ఆమె అవకాశం కల్పించారు. లిక్కర్ స్కాం విషయం లో విచారణకు హైదరాబాద్ సేఫ్ ప్లేస్ అని కవిత భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో అయితే ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం బిజెపి చేతుల్లో ఉంటుంది.. ఎందుకైనా మంచిదని హైదారాబాద్ ను ఎంచుకున్నారు. హైదరాబాద్ లో విచారణ అంటే జనరల్ కన్సెంట్ రద్దు అంశం ఆటంకం ఆవుతుందని సీబీఐ వ్యూహాత్మకంగా ఢిల్లీ లేదా హైదరాబాద్ అని చెప్పింది. దీంతో కవిత హైదరాబాద్ ను ఎంపిక చేసుకున్నారు. దీంతో జనరల్ కన్సెంట్ ఎటూ కాకుండా పోయింది. ఆ మధ్య కేంద్ర దర్తాప్తు సంస్థలను రాష్ట్రంలో అడుగు పెట్ట బోనీయనంటూ కేసీఆర్ చెబితే…కవిత మాత్రం ప్లీజ్ వెల్ కం అంటూ ఆహ్వానం పలుకుతుండటం గమనార్హం.