
Kavitha- ED investigation
Kavitha- ED investigation: ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తప్పించుకునేందుకు కల్వకుంట్ల వారసురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిడ్డ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈడీ నుంచి పిలుపు రాగానే కవిత గజగజ వణికిపోతున్నారు. ముఖం చెమటలు పడుతోంది. ఈ క్రమంలో విచారణను తప్పించుకునేందుకు లీగల్‌గా ఉన్న అన్ని మార్గాలు అన్వేశిస్తున్నారు. ఇందుకోసం ఆరుగురు న్యాయనిపుణులతో నిరంతరం మంతనాలు జరుపుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా సుప్రీంకోర్టు న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నారు.
11న ఈడీ ముందుకు..
ఈడీ నుంచి నోటీసులు అందిన వెంటనే.. కవిత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. విచారణకు నేను రెడీ అని ప్రకటించారు. అరెస్ట్ చేసినా భయపడను అని తెలిపారు. ప్రజాక్షేత్రంలోనే బీజేపీ తీరును ఎండగడతామని కవితతోపాటు ఆమె సోదరుడు తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు కూడా బీరాలు పలికారు. బీజేపీ నేత బీఎల్.సంతోష్లా స్టే తెచ్చుకోమని అన్నారు. ఈ క్రమంలో ఈనెల 11న కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆరోజు సుమారు 9 గంటలపాటు ఈడీ అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో ఈ స్కాంతో సంబంధం ఉన్న ఆధారాల్లో కొన్ని ఈడీ అధికారులు కవిత ముందు పెట్టినట్లు తెలిసింది.
విచారణకు వెళ్తే మళ్లీ రానని..
మొదటి విచారణతోనే కవితకు తాను పూర్తిగా ఇరుక్కుపోయానన్న విషయం అర్థమైంది. జీవితంలో తొలిసారి ఈడీ విచారణ ఎదుక్కొన్న కవిత ఊహించని షాక్ తిన్నారు. దీంతో మరోమారు విచారణకు వెళ్తే ఇక తాను అటునుంచి అటే జైలుకు వెళ్లడం ఖాయం అన్న విషయం ఆమెకు అర్థమైంది. మళ్లీ ఈడీ గడప తొక్కితే కనీసం మూడునెలలు జైలు కూడు తప్పదని భావిస్తుంది. దీంతో ఈడీ విచారణకు వెళ్లకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఒంటరిగా వెళ్తేనే ఆధారాలు చూపిన ఈడీ, ఇక రామచంద్రపిళ్లై, బుచ్చిబాబుతో కలిసి విచారణ జరిపితే తన బండారం మొత్తం బయటపడుతుందని భావిస్తున్నారని ప్రచారం జరగుతోంది. అందుకే వారితో కలిపి చేసే విచారణకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
న్యాయ నిపుణులకు లక్షల కుమ్మరిస్తున్న కవిత..
ఇదిలా ఉంటే తనను ఎలాగైనా ఈడీ విచారణ నుంచి తప్పించాలంటూ కవిత న్యాయ నిపుణులకు లక్షల రూపాయలు కుమ్మరిస్తున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారని సమాచారం. లీగల్‌గా అవకాశం లేకపోతే.. లాజికల్‌గా తప్పించుకునే మార్గమైనా వెతకాలని బతిమిలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదని చెబుతున్నట్లు సమాచారం. కవితకు న్యాయ సలహాలు ఇస్తున్న న్యావాదుల్లో గంటకు రూ.10 లక్షల తీసుకునే లాయర్లు ఉన్నట్లు సమాచారం. అయినా కవిత ఖర్చుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది.

Kavitha- ED investigation
20న హాజరుపై సస్పెన్స్..
ఇదిలా ఉంటే.. ఈనెల 20న కవిత ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్షన్ కొనసాగుతోంది. కోర్టుల నుంచి స్టే తెచ్చుకోమని చెప్పిన కవితే.. సుప్రీం తలుపు తట్టారు. ఈడీ విచారణ నుంచి మినహాయించాలని కోరింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు ఏమీ అనకముందే ఆరోపణలు చేసింది. మరోవైపు ఈనెల 16 సుప్రీకోర్టు విచారణ తర్వాతనే విచారణకు వస్తానని ఈడీకి తన దూత ద్వారా లేఖ పంపింది. ఈ క్రమంలో ఈడీ 20న విచారణకు రావాల్సిందే అని మళ్లీ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణను ముందుకు జరపాలని సుప్రీ కోర్టుకు చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసి పుచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కవిత విచారణకు వెళ్లకపోతే.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కవిత ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.