Kashmir Files Director: రీసెంట్ గా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సినిమా ఏదైనా ఉందా అంటే కశ్మీర్ ఫైల్స్ అనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా, చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేసింది. 1990 కశ్మీరీ పండిట్స్ ఊచకోతల బ్యాక్ గ్రౌండ్ కథగా వివేక్ అగ్నిహోత్రి దీన్ని తెరకెక్కించారు. దేశ వ్యాప్తంగా దీనికి క్రేజ్ ఏర్పడటంతో రూ.250 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.

Kashmir Files Director
అయితే దీనికి బీజేపీ ముద్ర పడిపోయింది. బీజేపీ పాలిత ప్రాంతాలు దీన్ని బాగా సపోర్టు చేయడం. ఏకంగా ఈ మూవీని చూసేందుకు సెలవులు కూడా ప్రకటించడం పెద్ద వివాదాస్పదమే అయింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమా టీమ్ పై ప్రశంసలు కురిపించడంతో హైప్ వచ్చేసింది. ఇక ప్రతిపక్షాలు అయితే దీన్ని బీజేపీ సమీకరాణాల్లో తీశారంటూ విమర్శించాయి.
అయినా సరే ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది. కాగా ఇప్పుడు ఈ మూవీ టీమ్ ఆధ్వర్యంలో మరో రెండు సినిమాలు వస్తున్నాయని ప్రకటించారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా చేసిన అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మరో రెండు మూవీలను ప్రకటించారు. అవి కూడా వివాదాస్పద కథలే అని తెలుస్తోంది.
Also Read: ‘రాజమౌళి’కి పోటీ ఇచ్చే ఏకైక డైరెక్టర్ అతనే !
ఆ రెండు సినిమాలను కూడా యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ప్రజల సెంటిమెంట్లతో ఎలా ఆడుకుంటాయో వివరించనున్నారంట. అంటే ఆ రెండు మరిన్ని వివాదాలను తెరమీదకు తేవడం ఖాయం అని అర్థమవుతోంది.
మరి కశ్మీర్ ఫైల్స్ మూవీ మీద పడ్డట్టే.. వీరు తీయబోయే సినిమాలపై కూడా బీజేపీ ముద్ర పడుతుందా లేదా అన్నది చూడాలి. మొత్తంగా ఈ దర్శకుడు, ప్రొడ్యూసర్ మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారనున్నారన్నమాట.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు నష్టాల ప్రళయం !