Karthikeya-2: అమెరికాలో సైతం ‘కార్తికేయ-2’ సంచలన రికార్డు.. చరిత్ర సృష్టించిన నిఖిల్

Karthikeya-2: ‘కార్తికేయ‌-2’ సినిమా కలెక్షన్స్ చూసి మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో కలెక్ష‌న్ల‌లో ఈ సినిమా దుమ్ములేపుతుంది. యూఎస్ క‌లెక్ష‌న్లు ఆదివారం నాటికి 1.5 మిలియ‌న్ డాల‌ర్లు చేర‌తాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ఇలా కలెక్ట్ చేస్తే.. ఇది సరికొత్త రికార్డు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కానీ శ‌నివారం నాటికి సినిమా ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వడం విశేషం. ఈ విషయంలో బయ్యర్లు సైతం సర్ ప్రైజ్ అయ్యారు. ఈ […]

  • Written By: SRK
  • Published On:
Karthikeya-2: అమెరికాలో సైతం ‘కార్తికేయ-2’ సంచలన రికార్డు..  చరిత్ర సృష్టించిన నిఖిల్

Karthikeya-2: ‘కార్తికేయ‌-2’ సినిమా కలెక్షన్స్ చూసి మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో కలెక్ష‌న్ల‌లో ఈ సినిమా దుమ్ములేపుతుంది. యూఎస్ క‌లెక్ష‌న్లు ఆదివారం నాటికి 1.5 మిలియ‌న్ డాల‌ర్లు చేర‌తాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ఇలా కలెక్ట్ చేస్తే.. ఇది సరికొత్త రికార్డు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కానీ శ‌నివారం నాటికి సినిమా ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వడం విశేషం. ఈ విషయంలో బయ్యర్లు సైతం సర్ ప్రైజ్ అయ్యారు. ఈ స్థాయిలో ఈ సినిమా వసూళ్ళను సాధిస్తోందని ఎవ్వరూ ఊహించలేదు.

Karthikeya-2

nikhil

మొత్తానికి ఇప్ప‌టివ‌రకు అమెరికాలో ఈ చిత్రం మొత్తం గ్రాస్ 1,509,768 డాల‌ర్లుగా ఉంది. నిఖిల్ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వ‌సూలుచేసింది. అబద్దపు కలెక్షన్ల మాయాజాలంలో పూర్తిగా ఫేక్ పబ్లిసిటీతోనే బ్రతికే సినిమా స్టార్లు ఉన్న ఇండస్ట్రీలో నిజాయితీతో హిట్ కొట్టాడు నిఖిల్. కార్తికేయ 2తో సూపర్ హిట్ కొట్టాక కూడా మీడియా మాయలో కొట్టుకుపోవాలనుకోలేదు.

సక్సెస్ అందుకున్న హీరోనే అయినప్పటికీ.. నిర్మాతల అడ్వాన్స్ లకు తలొగ్గలేదు. పైగా ‘కార్తికేయ 2’ హిట్ కి కారణం తన గొప్పతనం కాదు, సినిమా కథకు ఉన్న కెపాసిటీ అది అని సగర్వంగా చెప్పాడు. గ్రాఫిక్స్ స్వర్గంలో తేలియాడకుండా నిజాయితీగా నేల మీదే ఉన్నాడు. అన్నిటికీ మించి తన సినిమా కలెక్షన్స్ విషయంలో ఎంతో నిఖ్ఖచ్చిగా ఉన్నాడు.

అసలు ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ 2, అన్ని కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ?, ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతున్న షాకింగ్ విషయం. రోజులు గడిచే కొద్దీ.. రోజురోజుకు తన లైఫ్ స్పాన్ పెంచుకుంటూ పోతుంది ‘కార్తికేయ 2’. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకూ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది.

Karthikeya-2

nikhil

మొత్తానికి పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేస్తున్నాడు. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఒక సంచలనం. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ గా వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలో నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి

Tags

    Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
    oktelugu whatsapp channel
    follow us
    • facebook
    • instagram
    • twitter
    • youtube