Karthikeya, KGF, Kantara: కార్తికేయ, కేజిఎఫ్, కాంతారా: హిందూ దేవుళ్ళ చుట్టే సినిమాల ప్రదక్షిణలు

Karthikeya, KGF, Kantara: Films around Hindu Gods : అరువు కథలు, ఎలివేషన్ కథలు, రొడ్డ కొట్టుడు రొటీన్ కథలు తీసి తీసి దర్శకులకు మొహం మొత్తిందా? నవ్యత వైపు ప్రయాణించే క్రమంలో హిందుత్వ దేవుళ్ళనే నమ్ముకున్నారా?  అంటే ఇందుకు అవును అనే సమాధానాలు వస్తున్నాయి. కాంతారా, కేజీఎఫ్_1, 2, కార్తికేయ 1, 2 సినిమాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సినిమా అంటే కేవలం దేవుళ్ళ మహిమలే కాకుండా.. ఆ వృత్తాంతాలను, నేపథ్యాలను కథలుగా మలచడం వల్ల ప్రేక్షకులు […]

  • Written By: Bhaskar
  • Published On:
Karthikeya, KGF, Kantara: కార్తికేయ, కేజిఎఫ్, కాంతారా: హిందూ దేవుళ్ళ చుట్టే సినిమాల ప్రదక్షిణలు

Karthikeya, KGF, Kantara: Films around Hindu Gods : అరువు కథలు, ఎలివేషన్ కథలు, రొడ్డ కొట్టుడు రొటీన్ కథలు తీసి తీసి దర్శకులకు మొహం మొత్తిందా? నవ్యత వైపు ప్రయాణించే క్రమంలో హిందుత్వ దేవుళ్ళనే నమ్ముకున్నారా?  అంటే ఇందుకు అవును అనే సమాధానాలు వస్తున్నాయి. కాంతారా, కేజీఎఫ్_1, 2, కార్తికేయ 1, 2 సినిమాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సినిమా అంటే కేవలం దేవుళ్ళ మహిమలే కాకుండా.. ఆ వృత్తాంతాలను, నేపథ్యాలను కథలుగా మలచడం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురవుతున్నారు.. అందువల్లే ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు.

కొత్త నేపథ్యంతో..

కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన కార్తికేయ మంచి వసూళ్లను రాబట్టింది.. నిఖిల్ కెరీర్ లో డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా కార్తికేయ 2 వచ్చింది.. ఇది 100 కోట్లు కొల్లగొట్టింది. హిందీ మార్కెట్ ను షేక్ చేసింది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే సినిమా కార్తికేయ 2 దెబ్బకు పక్కకు తప్పుకుందంటే వసూళ్ల ప్రభంజనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

-కన్నడ ఊగిపోయింది

కే జి ఎఫ్ సినిమా చూసిన వారెవరు రాఖీ పాత్రను మర్చిపోరు. కానీ ఆ రాఖీ పాత్రకు రిఫరెన్స్ కాళికాదేవి. ఆ కాళికాదేవి రాక్షసులపై ఏ విధంగా తాండవం చేసిందో.. అదేవిధంగా రాఖీ కూడా తన ప్రత్యర్థులపై విరుచుకుపడతాడు.. ఈ సినిమా మొదటి రెండు భాగాల్లో కాళికాదేవి ప్రతిమను ప్రముఖంగా చూపించారు.. గరుడను రాఖి కాళికాదేవి ముందే కత్తితో నరకడం చూపించారు. రెండో భాగం లో కూడా కాళికాదేవి ముందే రాఖి పూజలు చేయడాన్ని చూపించారు.

*ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కాంతారా సినిమాలో వరాహరూపాన్ని మర్చిపోగలరా? అంతలా ఇంపాక్ట్ చేసింది ఈ సినిమా. 400 కోట్లకు పైచిలుకు వసూళ్ళు సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమాలో కంజుర్లి దైవ, గుళిక దైవ పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించారు.. వాటి ఆధారంగానే సినిమాను నడిపారు.. ఈ సినిమాలో శివ పాత్రకు శివుడి రెఫరెన్స్ తీసుకున్నారు. అంతేకాదు తులునాడు ప్రాంతంలో గిరిజనుల ఆచారాలను ప్రముఖంగా చూపించారు.. ఈ సినిమాని కన్నడ ప్రజలు తమ ప్రైడ్ గా అభివర్ణించారంటే ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

దర్శకులు మారిపోయారు

కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది.. ఓటీటీ లు కూడా అందుబాటులోకి రావడంతో విభిన్నమైన కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సమయంలో ప్రేక్షకులు రొటీన్ సినిమాలు చూసేందుకు ఇష్టపడటం లేదు. అందుకే పూర్తి విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో దర్శకులు కూడా విభిన్నమైన కథల వైపు ప్రయాణం చేస్తున్నారు.. తెలుగులో మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి శ్రీను .. బాలకృష్ణతో తీసిన అఖండ సినిమాలో శివుడి రెఫరెన్స్ వాడుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఒకవేళ ఈ సినిమా లో శివుడి రెఫరెన్స్ కనుక లేకుంటే ప్రేక్షకులకు అంతగా రీచ్ అయ్యేది కాదు.. పైగా పురాణాల్లో సినిమాటిక్ సరుకు బాగుంటుంది కాబట్టి, దానిని నవీన జీవితానికి అనుసంధానిస్తే ఫలితం బాగుంటుంది కాబట్టి.. దర్శకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.. త్వరలో ప్రభాస్ హీరోగా రాబోయే ఆది పురుష్, సలార్, హనుమాన్… ఇవన్నీ కూడా దేవుళ్ళ కథలతో నిర్మితమవుతున్న సినిమాలే.. ఇవే కాక మరికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. కనిపించని దైవం మనల్ని నడిపిస్తుంది కాబట్టి… ఆ దైవం ఆధారంగానే ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి.. మొత్తానికి దర్శకులు మారారు అది ఇప్పుడు ప్రేక్షకులకు సంతోషం కలిగించే విషయం.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు