Sardar Telugu Movie Review: మూవీ పేరు: సర్ధార్
నటీనటులు: కార్తి, రాశిఖన్నా, రజిషా, చుంకీ పాండే, సిమ్రాన్, మురళీ శర్మ
దర్శకుడు : పీఎస్ మిత్రన్
నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: జార్జ్ విలయమ్స్

Sardar Telugu Movie Review
పొన్ని యన్ సెల్వన్ 1 మూవీతో గ్రాండ్ హిట్ అందుకున్న హీరో ‘కార్తి’ . ఇప్పుడు ఆ సినిమా సందడి తగ్గకముందే మరో సినిమా ‘సర్ధార్’తో మన ముందుకొచ్చాడు. అభిమన్యుడు లాంటి థ్రిల్లర్ మూవీని తీసిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్ధార్ మూవీ తమిళనాట మంచి హిట్ అందుకుంది. దీన్ని తెలుగులోనూ ఈరోజు రిలీజ్ చేశారు.ట్రైలర్ తోనే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈరోజు అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందన్నది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఈ సినిమాలో కార్తి విజయ్ ప్రకాష్ అనే పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలంటూ దూకుడైన పనులు చేస్తుంటాడు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించకుండా పోయినప్పుడు ఈ కథ మలుపు తిరుగుతుంది. ఆ ఫైల్ ఏంటి? అందులోని సైనిక రహస్యాలు ఎలా మాయమయ్యాయన్న దానిపై సీబీఐ, రా వెతుకుతుంటాయి. అయితే పోలీస్ అధికారి అయిన కార్తి ఈ విషయాన్ని తెలుసుకొని మీడియాలో ఫేమ్ కోసం దేశవ్యాప్తంగా పాపులారిటీ కోసం ఈ ఫైల్ ను వాడుకుంటాడు. అయితే ఈ క్రమంలో కార్తి తండ్రి కనపడడం.. అతడు మిషన్ లో భాగమవ్వడం.. అసలు ఏంటా ఫైల్..
-ప్లస్ పాయింట్లు
-కథ,
-స్క్రీన్ ప్లే
-కార్తీ పెర్ఫామెన్స్
-మైనస్ పాయింట్లు
-సెకండాఫ్ స్లోగా సాగే సన్నివేశాలు
-తమిళ ఫ్లేవర్ తో విసుగు

Sardar Telugu Movie Review
-విశ్లేషణ
సర్ధార్ మూవీ తీసిన మిత్రన్ దర్శకత్వ శైలి విభిన్నంగా ఉంటుంది. తొలి చిత్రం అభిమన్యుడుతోనే ఆయన ఆకట్టుకున్నాడు. బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాలను కళ్లకు కట్టాడు. ఇప్పుడు ‘సర్ధార్’ మాత్రం డిఫెరెంట్ కాన్సెప్ట్. ఇదో గూఢచారి కథ. సినిమాలో ఆసక్తికర సీక్వెన్స్ తో నడిపించాడు. ఒక సైనిక రహస్యాల ఫైల్ కోసం రా, సీబీఐ తోపాటు ఒక పోలీస్ వెతకడంలో పడ్డ కష్టాలు.. అందులోని సస్పెన్స్ ను తెరపై చూపించాడు. కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ రసవత్తరంగా సాగితే ఫ్లాష్ బ్యాక్, సెకాండాఫ్ నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ లో మళ్లీ ఆసక్తికరంగా మలిచాడు. కొన్ని సాగదీసే సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు బాగానే ఉన్నాయి. డ్రామా, ఎమోషన్ లు బాగా పండాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సినిమాలు హైలెట్ అని చెప్పొచ్చు. కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. నటనలో కార్తి చింపేశాడని చెప్పొచ్చు. రాశిఖన్నా ఇందులో లాయర్ పాత్రలో ఫర్వాలేదనిపించింది. ఈమెకు పెద్దగా స్కోప్ రాలేదు. రజిషా, చంకీపాండే మిగిలిన తారాగణం పరిధి మేరకు నటించారు.
గూఢచారిగా దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఈ కథ కనెక్ట్ అయ్యేలానే ఉంది. కార్తి ధైర్యసహసాలు సినిమాలో చక్కగా ఎలివేట్ అయ్యాయి. సాంకేతికంగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు బాగానే తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమిళ ఫ్లేవర్ పాటలు తెలుగు జనాలకు కనెక్ట్ కావు. మిగిలినందతా ఓకే..
ఓవరాల్ గా సర్ధార్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే గూఢచారి చిత్రంగా చూడొచ్చు అని చెప్పొచ్చు. సర్ధార్ మూవీలో కార్తితోపాటు రాశిఖన్నా, చుంకీ పాండే, సిమ్రాన్, మునిష్కాంత్ , మురళీ శర్మ, విజయన్ లాంటి కీలక వ్యక్తులు మంచిపాత్రలు పోషించారు. జార్జ్ విలయమ్స్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. జివి. ప్రకాష్ సంగీతం ఉత్కంఠ రేపింది.
-సినిమా రేటింగ్ : 2.5/5