Karnataka Assembly Election Results 2023: దేశం చూపు కర్ణాటక వైపు.. కౌంటింగ్ షురూ..
కర్నాటకలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది. కౌంటింగ్ మొదలై ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకే మొగ్గు ఉంది. కన్నడ ప్రజలే కాదు..

Karnataka Assembly Election Results 2023: వీకెండ్.. వేళ అందరిచూపు.. కన్నడ రాజ్యం వైపే ఉంది. నెల రోజుల నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడబోతోంది. కన్నడలో ఎగిరే జెండా ఎవరిదో తేలిపోనుంది., కర్నాటక తీర్పు ఎలా ఉండబోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా?. కర్నాటక కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరు! అధికార పీఠమెక్కే పార్టీ ఏది!. బీజేపీ నిలబడుతుందా.. లేక, కాంగ్రెస్ చెక్ పెడుతుందా..? జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా..? అనేది కొన్ని గంటల్లో తేలనుంది.
పోటీలో కీలక నేతలు..
సిఎం బస్వరాజు బొమ్మై షిగ్గాన్ నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ దిగ్గజాలు సిద్ద రామయ్య వరుణ నుంచి, డీ.కే. శివకుమార్ కనకపుర, మాజీ సిఎం జగదీష్ షెట్టర్ హుబ్లి ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలో దిగారు. జేడీఎస్ నేత, మాజీ సిఎం కుమారస్వామి చెన్నపట్టణనుంచి పోటీ చేయగా…గంగావతి నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి నుంచి ఆయన భార్య అరుణ బరిలో నిలిచారు.
మధ్యాహ్నం నాటికి స్పష్టత..
కర్నాటకలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది. కౌంటింగ్ మొదలై ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకే మొగ్గు ఉంది. కన్నడ ప్రజలే కాదు.. అటు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగగా…36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్ అమలులో ఉంది.
కాంగ్రెస్.. బీజేపీ హోరాహోరీ..
కాంగ్రెస్.. బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ప్రారంభమైంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది..
మరోవైపు ఎగ్జిట్‌పోల్స్‌పై జేడీఎస్ అధినేత కుమారస్వామి స్పందించారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. మరో రెండుమూడు గంటలు వేచి చూద్దాం.. నాకు ఎవరూ ఆఫర్ చేయలేదు.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది నేనేనంటూ కుమారస్వామి సంచలన కామెంట్స్ చేశారు. .
జేడీఎస్ మళ్లీ కింగ్ మేకరా
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో జేడీఎస్ మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, హంగ్ అవకాశమే లేదని.. గెలుపు తమదేనంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మధ్యాహ్నంలోగా కర్నాటక ఫలితం తేలనుంది. అయితే, జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అంచనాలు వేసిన నేపథ్యంలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కింపు..
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్‌లను అధికారులు తెరిచారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది.. ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు.
జోరుగా బెట్టింగ్ లు
కాంగ్రెస్-బీజేపీ గెలుపుపై బెట్టింగ్‌లు మొదలయ్యాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలపై పక్కా అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు, తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులోని పట్టణాల్లో తిష్టవేశారు. ఏకంగా క్యాష్ పట్టుకునే బహిరంగంగా బెట్టింగ్‌కి దిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్-బీజేపీ.. ఈ రెండింటిపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు.
కొన్ని గంటల్లో 2430 మంది పురుష అభ్యర్థులు, 184 మంది మహిళా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇద్దరు థర్డ్ జెండర్ అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. బీజేపీకి 224, కాంగ్రెస్‌కు 223, జేడీఎస్ 207, ఆప్ 209, బీఎస్‌పీకి 133, సీపీఐ 4, జేడీయూ 8, ఎన్‌పీపీ 2, పార్టీయేతర అభ్యర్థులు 918 మంది బరిలో ఉన్నారు.
