
Kareena kapoor On Natu Natu Song
Kareena kapoor On Natu Natu Song: నాటు నాటు సాంగ్ క్రేజ్ ఏంటో చెప్పడానికి ఇదో నిదర్శనం. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చిన్న కొడుకు నాటు నాటు సాంగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడట. ఆ పాట పెడితేనే ఫుడ్ తింటున్నాడట. రెండేళ్ల తన చిన్న కుమారుడు జహంగీర్ నాటు నాటు సాంగ్ కి అంతగా అలవాటు అయ్యాడట. ఈ విషయాన్ని కరీనా కపూర్ స్వయంగా వెల్లడించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ నాటు నాటు సాంగ్ తో పాటు ఇండియన్ సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడం గొప్ప విషయం. ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. భారతీయ చిత్రాలను అందరూ ఇష్టపడుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఒక సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను, అన్నారు. నా చిన్న కొడుకు జహంగీర్ నాటు నాటు సాంగ్ పెడితేనే భోజనం చేస్తున్నాడు. ఈ పాటను నేను తెలుగులో వినడానికి ఇష్టపడతాను… అని చెప్పుకొచ్చారు. తెలుగు సాంగ్ గురించి కరీనా కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
95వ ఆస్కార్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన కీరవాణి, సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ ఆస్కార్ వేదికపై తమ అవార్డ్స్ అందుకున్నారు. కీరవాణి ఆస్కార్ వేదికపై తన ఆనందాన్ని తెలియజేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న నేపథ్యంలో ఈవెంట్లో పాల్గొనే అరుదైన అవకాశం ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి దక్కింది.

Kareena kapoor On Natu Natu Song
కరీనా కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు తెలుగు సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా విజయం అంటున్నారు. స్టార్ హీరోయిన్ గా కరీనా కపూర్ పరిశ్రమను ఏలారు. 2012లో కరీనా కపూర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకున్నారు. ఆయనకు కరీనాతో రెండో వివాహం. వీరిద్దరికీ ఓ పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కరీనా-సైఫ్ దంపతులు ఇద్దరు కుమారులు. 2016లో తైమూర్, 2021 లో జహంగీర్ జన్మించారు.